మరో ట్విస్ట్: సీబీఐ నుంచి రాకేష్ ఆస్థానా ఔట్
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్‌గా ఉన్న రాకేష్ ఆస్థానాల మధ్య వివాదం ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆస్థానాపై కేసు నమోదు కాగా, అలోక్ పైన అతను ఆరోపణలు చేశారు. దీంతో ఇద్దరిని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెలవులపై పంపించింది.
ఆ తర్వాత తనను సెలవులపై పంపించడంపై అలోక్ వర్మ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆయన సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఒక రోజులోనే ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సుప్రీం కోర్టు న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆయనను తొలగించింది.

దీంతో అలోక్ వర్మ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా సీబీఐ నుంచి రాకేష్ ఆస్థానాను బదలీ చేశారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి ఆయనను బదలీ చేశారు. తనపై అవినీతి కేసు నమోదు చేయగా, దానిపై ఆస్థానా హైకోర్టుకు వెళ్లారు. కానీ ఆయనకు ఊరట దక్కలేదు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications