Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల ఎఫెక్ట్ : పెట్రోల్,డీజిల్‌లపై ట్యాక్స్ తగ్గింపుకు కేంద్రం సిద్దమవుతోందా...?

గత కొన్ని నెలలుగా నిత్యం పైపైకి ఎగబాకుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న పెట్రోల్,డీజిల్ ధరల విషయంలో కేంద్రం ఆలోచనలో పడిందా...? ఇంధన ధరలపై పన్నును తగ్గించే యోచనలో ఉందా...? కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి ఇందుకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరికొద్దిరోజుల్లో నాలుగు రాష్ట్రాలు,ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపుల ప్రక్రియను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

Recommended Video

    Fuel Price Hike: Centre Govt May Cut Taxes On Petrol, Diesel పెట్రోల్, డీజిల్‌లపై ట్యాక్స్ తగ్గింపు!
    తాత్కాలికంగా తగ్గిస్తారా?

    తాత్కాలికంగా తగ్గిస్తారా?

    పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజస్తాన్,మధ్యప్రదేశ్‌లలో ఇప్పటికే పెట్రోల్ ధరలు సెంచరీ మార్క్‌ను చేరాయి. పెరిగిన ధరలు సామాన్యుడికి తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. మరోవైపు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు ఇదో అస్త్రంగా మారింది. దీంతో పెట్రోల్,డీజిల్ ధరలపై పన్నును తాత్కాలికంగానైనా తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.

    జీఎస్టీ కిందకు తీసుకొచ్చే ఆలోచన లేదన్న కేంద్రం

    జీఎస్టీ కిందకు తీసుకొచ్చే ఆలోచన లేదన్న కేంద్రం

    కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రోల్,డీజిల్‌ పైనే చాలా ఆదాయం సమకూరుతోంది. కేంద్రం విధిస్తున్న సుంకాలు,రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే వ్యాట్ కలుపుకుని మొత్తంగా 5.5లక్షల కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఒకవేళ పెట్రోల్,డీజిల్‌ ధరలను జీఎస్టీ కిందకు తీసుకొస్తే సుమారు 2.5లక్షల కోట్ల ఆదాయం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కేంద్రం అందుకు సిద్దంగా లేదు. పెట్రోల్,డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే సిఫార్సులేవీ జీఎస్టీ కౌన్సిల్ చేయలేదని తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా స్పష్టతనిచ్చారు.

    ఎన్నికల ఎఫెక్ట్...

    ఎన్నికల ఎఫెక్ట్...

    గత కొద్ది నెలలుగా నిత్యం పైపైకి ఎగబాకుతున్న ఇంధన ధరలు గడిచిన 9 రోజులుగా స్థిరంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే తాత్కాలికంగా ధరల పెరుగుదల నిలిచిపోయినట్లు తెలుస్తోంది. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే జరిగింది. ఎన్నికలకు ముందు దాదాపు 55 నెలల గరిష్టానికి పెట్రోల్,డీజిల్ ధరలు చేరుకున్నాయి. అయితే ఎన్నికలు దగ్గరపడ్డ తర్వాత వరుసగా 19 రోజుల పాటు ధరలు స్థిరంగా కొనసాగాయి. ఆ తర్వాత ఓటింగ్ ముగిసిన రెండు రోజులకే మళ్లీ ధరలకు రెక్కలు వచ్చాయి. అయితే ప్రభుత్వ ప్రమేయంతోనే ఇలా ధరల నియంత్రణ జరిగిందన్న ప్రచారాన్ని చమురు కంపెనీలు ఖండించాయి.

    ట్యాక్స్ తగ్గించే యోచన...

    ట్యాక్స్ తగ్గించే యోచన...

    పశ్చిమ బెంగాల్,అసోం,కేరళ,తమిళనాడు,పుదుచ్చేరి రాష్ట్రాల్లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలకు ఇదో బలమైన అస్త్రంగా మారింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అత్యంత కనిష్ఠానికి పడిపోయినప్పుడు కూడా భారత్‌లో ధరలు ఎందుకు తగ్గించలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సామాన్య,మధ్య తరగతి వర్గాన్ని ఇది ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో కేంద్రం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పెట్రోల్,డీజిల్‌లపై పన్ను తగ్గింపు దిశగా ఆలోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది దేశవ్యాప్తంగా అమలుచేసే నిర్ణయం కావడంతో ఎన్నికల కోడ్ కూడా దీనికి అడ్డు రాదని భావిస్తున్నట్లు సమాచారం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+