బొనాంజా సేల్: రూ.444కే స్పైస్‌జెట్ విమాన టికెట్!

న్యూఢిల్లీ: దేశంలో నాలుగో ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ 'మాన్‌సూన్‌ బొనాంజా సేల్‌' పేరుతో బడ్జెట్ ఆఫర్లను ప్రకటించింది. దేశీయ రూట్లలో పలు విమాన టిక్కెట్లపై భారీ తగ్గింపు ఆఫర్‌లు ప్రకటించింది.

ఒకవైపు ప్రయాణం ప్రారంభ ధర రూ.444 మాత్రమేనని తెలిపింది. జమ్మూ- శ్రీనగర్‌, అహ్మదాబాద్‌-ముంబై, ముంబై-గోవా, ఢిల్లీ-డెహ్రడూన్‌, ఢిల్లీ-అమృత్‌సర్‌ రూట్లలో ఒక వైపు ఛార్జీ రూ.444 మాత్రమేనని పేర్కొంది.

SpiceJet offer: Budget airliner’s Red Hot fares scheme priced at Rs 444

అయితే మిగిలిన రూట్లలో సెక్టార్లు, ప్రయాణ దూరాన్ని బట్టి ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయని చెప్పింది. ఐదు రోజుల పాటు అంటే జూన్‌ 26 వరకు ఈ ఆఫర్‌ కింద టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది.

దీని కింద టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారు జూలై1 నుంచి సెప్టెంబర్‌ 30లోపు ప్రయాణాలు చేయవచ్చు. స్పైస్‌జెట్‌.కామ్‌తోపాటు ఇతర ట్రావెల్‌ పోర్టళ్లు, ట్రావెల్‌ ఏజెంట్ల ద్వారా ఈ ఆఫర్‌ ద్వారా టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఫస్ట్‌ కమ్‌-ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో సీట్లు కేటాయిస్తామని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+