ప్రియురాలిపై కోపంతో చర్చిని ధ్వంసం చేశాడు
ఆగ్రా: ఓ క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించిన ప్రియుడు, ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాగా, అమ్మాయి తరపు కుటుంబసభ్యులు అబ్బాయి ముస్లిం కావడంతో పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మన పెళ్లి కుదరదని అమ్మాయి.. అబ్బాయికి తేల్చి చెప్పింది. ఈ పరిణామంతో కోపం పెంచుకున్న ఆ ముస్లిం యువకుడు ఓ చర్చిని ధ్వంసం చేశాడు.
ఆ యువకుడు ఎవరో కాదు, ఏప్రిల్ 16న ఆగ్రా నగరంలోని ప్రతాప్‌పురా ప్రాంతంలోని సెయింట్ మేరీస్ చర్చిపై దాడి చేసి ధ్వంసం చేసిన నిందితుడు. పోలీసులకు చిక్కిన ఆ యువకుడ్ని విచారించడంతో అసలు విషయం చెప్పాడు. తనతోపాటు మరో ఇద్దరు కూడా చర్చిని ధ్వంసం చేసిన ఘటనలో నిందితులని తెలిపాడు విఫల ప్రేమికుడు హైదర్ అలీ.

పోలీసులకు ఆలీ తెలిపిన వివరాల ప్రకారం.. సదరు చర్చికి వెళ్లే ఓ యువతి, హైదర్‌లు కొంత కాలంగా ప్రేమించుకున్నారని తెలిపారు. మతాలు వేరవ్వడంతో ఆమె పెళ్లికి నిరాకరించి, చర్చికి రావడం మానేసింది. దీంతో ఆమెపై కోపం పెంచుకుని.. తమను విడదీసిన కారణంపై అక్కసుతో హైదర్ ఈ దురాగతానికి ఒడిగట్టాడు.
ఈ మేరకు నిందితుడు వాగ్మూలం కూడా రాసిచ్చినట్లు సమాచారం. అయితే హైదర్‌ను అదుపులోకి తీసుకున్న విషయం తప్ప మిగతా వివరాలు వెల్లడించేందుకు ఆగ్రా సిటీ ఎస్పీ సమీర్ సౌరభ్ నిరాకరించారు. కాగా, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని డిఐజి లక్ష్మీ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications