ఏడాదిగా వెంట పడుతున్నాడు: ప్రేమించలేదని ఆమెపైకి కారు ఎక్కించాడు
కొచ్చి: ఓ ప్రేమోన్మాది కేరళలో అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఏడాది కాలంగా వెంటపడుతున్నా 22 ఏళ్ల అమ్మాయి అతన్ని పట్టించుకోవడం లేదు. దాంతో కక్ష పెంచుకున్న అతను అమ్మాయిపైకి కారు ఎక్కించాడు.
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని అరింబూర్‌లో ఆ సంఘటన చోటు చేసుకుంది. బికాం రెండో సంవత్సరం చదువుతున్న అమ్మాయిపై 21 ఏళ్ల షెబీన్ అనే యువకుడు ఆ దారుణానికి పాల్పడ్డాడు.

గుడికి వెళ్లి వస్తున్న సమయంలో అమ్మాయిపై అతను కారుతో దాడికి దిగాడు. ఆమెకు సహాయం చేసేందుకు వచ్ిచన మరో ఐదుగురిపైకి కూడా అతను కారు ఎక్కించాడు. కారు రివర్స్ తీసుకుని వచ్చి మరీ వారిని కారుతో గుద్దాడు. ఈ దాడిలో వారు గాయపడ్డారు.
క్షతగాత్రుల్లో ఒకతను వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుండగా, మరో వ్యక్తి ఐసియులో ఉన్నాడు. సంఘటన తర్వాత షెబిన్ తల్లిదండ్రులతో సహా పరారయ్యాడు. అతనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications