శోభనం తర్వాతే పెళ్లి.. అక్కడ వింత ఆచారం

సహజీవనం అనేది మన సంప్రదాయం కాదనే విషయం తెలిసిందే. అయితే నేటి భారతదేశంలో లివింగ్ రిలేషన్‌షిప్ కూడా ఒక భాగమైంది. నేటితరం యువత సహజీవనానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.అయితే గతంలో పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకునే ఆచారం కొన్ని సంస్కృతుల్లో ఉంది.ఈ ఆచారం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.కొన్ని సంస్కృతుల్లో, వివాహానికి ముందు సంతానం కలిగి ఉండటం ద్వారా ఆ జంట సంతానోత్పత్తికి అర్హులా కాదా అని నిర్ధారించుకుంటారు.

పిల్లలు పుట్టారని తెలిస్తేనే పెళ్లి చేసుకోవడం వల్ల భవిష్యత్తులో సంతానం కలగకపోతే వచ్చే సమస్యలను నివారించవచ్చని నమ్ముతారు.అయితే మన దేశంలో కొన్ని ప్రదేశాల్లో పిల్లలు పుట్టిన తర్వాతే పెళ్లి చేసుకుంటారు. ఈ తంతు ఇప్పటికీ జరుగుతూనే ఉంది. 'గరాసియా తెగ'లో ఇటువంటి సంప్రదాయం కొనసాగుతోంది. గరాసియా తెగ భారతదేశంలోని రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలలో నివసించే ఒక గిరిజన సమూహం. వారి ప్రత్యేక సాంస్కృతిక ఆచారాలు, సంప్రదాయాలు మరియు జీవన విధానానికి ప్రసిద్ధి చెందారు.గరాసియా తెగలో వివాహ ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి.ఈ తెగలో పెళ్లికి ముందు సహజీవనం చేయడం సాధారణం.ఈ తెగలో స్త్రీలకు చాల స్వేచ్ఛ ఉంటుంది.

Strange customs among the Garasia tribe

స్త్రీలు తమకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేయచ్చు.. పిల్లల్ని కనచ్చు.. ఆర్థికంగా స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవచ్చు.. నచ్చకపోతే అతడితో విడిపోవచ్చు.పెళ్లికి ముందే నచ్చిన వారితో సహజీవనం చేసి.. పిల్లల్ని కనే సంప్రదాయం ఆ తెగలో అతి సాధారణ విషయం. దీని గురించి ప్రశ్నించే హక్కు, అధికారం అక్కడ ఎవరికీ ఉండదు. ఈ తెగ అమ్మాయిలు నచ్చిన అబ్బాయితో సహజీవనం చేస్తారు. ఈ క్రమంలో పిల్లల్ని కనచ్చు. తర్వాత తమకు నచ్చితే వివాహం చేసుకుంటారు.ఇష్టం లేని మహిళలు విడిపోతారు.ఈ తెగలో వివాహానికి ముందు సహజీవనం చేయడం సాధారణం.అబ్బాయి కుటుంబ సభ్యులు అమ్మాయి కుటుంబానికి కొంత సొమ్మును ఇచ్చి సహజీవనాన్ని మొదలుపెట్టిస్తారు. భవిష్యత్తులో ఈ జంట వివాహం చేసుకోవాలనుకుంటే పెళ్లి ఖర్చులన్నీ వరుడి కుటుంబ సభ్యులే భరిస్తారు. ఈ ఆచారాన్ని అక్కడి తెగ వారు 'దాపా'గా పిలుస్తారు.ఈ ఆచారం కొత్తగా వచ్చింది కాదు.. ఎన్నో ఏళ్ల నుంచి గరాసియా తెగ వారు ఈ సంప్రదయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+