స్నేహితుడితో కలిసి ముంబైలో: వర్ధమాన మోడల్ సూసైడ్
ముంబై: ఢిల్లీకి చెందిన వర్ధమాన మోడల్ కరంజీత్ కౌర్ (25) ముంబైలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఇటీవలే ముంబైకి వచ్చింది. అంధేరి ప్రాంతంలోని ఓ ప్లాట్‌లో తన స్నేహితుడితో కలిసి నివసిస్తోంది. బుధవారం రాత్రి ఆమె స్నేహితుడు ప్లాట్‌కి తిరిగి వచ్చి చూసేసరికి ఆమె మృతి చెంది ఉంది.
అతను ప్లాట్‌కు వచ్చే సరికి లోపలి వైపు తలుపు గడియ వేసి ఉంది. దీంతో అనుమానం వచ్చిన అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో.. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, మోడలింగ్ రంగంలో సక్సెస్ అయ్యేందుకు కరంజీత్ కౌర్ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications