వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిత్రం విచిత్రం : తరగతి గదుల్లో ఈవీఎంలు.. విద్యార్థులేమో ఆరుబయట..!

|
Google Oneindia TeluguNews

పంజాబ్‌ : తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు ఆరు బయట పాఠాలు నేర్చుకుంటే.. ఓటింగ్ యంత్రాలు మాత్రం క్లాస్‌రూముల్లో దర్జా ఒలకబోస్తున్నాయి. స్కూల్ ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా ఈవీఎంలను తీసుకెళ్లకపోవడంతో అక్కడి విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

students study outside evms place in classrooms

పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆరుబయట పాఠాలు నేర్చుకుంటున్నారు. తరగతి గదుల్లో ఈవీఎంలను నింపి తాళాలు వేయడంతో తప్పని పరిస్థితుల్లో బయటే కూర్చుండాల్సిన పరిస్థితి దాపురించింది. తరగతి గదుల్లో పాఠాలు నేర్వాల్సిన స్టూడెంట్స్ స్కూల్ ఆవరణలో చదువుకుంటున్నారు.

టిక్ టాక్ సరదా మరో ప్రాణం తీసిందిగా.. మేడ్చల్ జిల్లాలో విషాదంటిక్ టాక్ సరదా మరో ప్రాణం తీసిందిగా.. మేడ్చల్ జిల్లాలో విషాదం

మే చివరి వారంలో ఈవీఎంలు ఈ స్కూల్లో పెట్టారు అధికారులు. తరగతి గదుల్లో ఉండాల్సిన బెంచీలను వరండాలో పెట్టి.. ఈవీఎంలను మాత్రం తరగతి గదిలో ఉంచి తాళాలు వేశారు. జూన్ నెలలో సెలవులు ఉండటంతో అవి అక్కడే ఉన్నాయి. అయితే జులై 8వ తేదీ నుంచి స్కూల్ రీఓపెన్ కావడంతో వాటిని అధికారులు ఖాళీ చేయించలేదు.

students study outside evms place in classrooms

అదలావుంటే ఈవీఎంలు తీసుకెళ్లాలని ఉన్నతాధికారులకు చెప్పామని అంటున్నారు స్కూల్ టీచర్లు. అయితే తరగతి గదుల్లో ఉన్న ఈవీఎంలను తీసుకెళతామని హామీ ఇచ్చినా ఇంతవరకు తీసుకెళ్లలేదని వాపోతున్నారు. దాంతో చేసేదేమీ లేక స్కూల్ ప్రాంగణంలోనే విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్లు వెల్లడించారు.

English summary
Students study outside as classrooms are filled with EVMs at a govt school in Ludhiana. Principal A Nanda says, We have told the higher authorities & they have assured quick action. EVMs have been kept here since May end, then there were school holidays in June and till 8th July.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X