మహిళా ఎస్‌ఐపై అత్యాచారం: వీడియో తీసి..పలుమార్లు

Sub-inspector alleges rape by colleague
జైపూర్: ఓ మహిళ ఎస్ఐపై తన సహోద్యోగి(ఎస్ఐ) మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడ్డాడు. అంతేగాక ఆ సమయంలో ఆమెకు సంబంధించిన వీడియో, అశ్లీల ఫొటోలను తీసి ఆమెను బెదిరింపులకు గురి చేశాడు. దీంతో ఆమె ఆ విషయాన్ని బయటికి చెప్పలేదు. కాగా, సుమారు ఏడాది తర్వాత బుధవారం ఈ విషయంపై ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధిత మహిళ జైపూర్(పశ్చిమ) డిసిపిగా కొనసాగుతున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. మహావీర్ సింగ్ బిష్నోయ్ ఎస్ఐగా పని చేస్తున్న స్టేషన్‌లోనే బాధిత మహిళ కూడా ఎస్ఐగా విధులు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 12, 2013న ఆమెను బిష్నోయ్ తన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెకు సంబంధించిన అశ్లీల వీడియో, ఫొటోలను చిత్రీకరించాడు. ఈ విషయాన్ని బయటికి చెబితే పొటోలను బహిర్గం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఆ తర్వాత తన ఫొటోలను బహిర్గతం చేస్తానని బెదిరింపులకు గురి చేసిన బిష్నోయ్.. ఆమెపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడు ఎప్పుడు జైపూర్ వచ్చినా ఫోన్ చేసి.. పిలిపించుకుని అత్యాచారం చేసేవాడని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడైన బిష్నోయ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. బాధితురాలికి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. పూర్తి విచారణ జరిపి నిందితుడ్ని త్వరలోనే అరెస్ట చేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+