15 రోజుల్లో ఆధార్ డీ లింక్ ప్లాన్ ఇవ్వండి: టెలికాం సంస్థలకు ఉడాయ్
న్యూఢిల్లీ: ఆధార్‌ను డీ లింక్ చేసే ప్లాన్‌ను పదిహేను రోజుల్లోగా ఇవ్వాలని భారత ఉడాయ్... టెలికాం సంస్థలను కోరింది. ఆధార్‌ను టెలికాం వినియోగదారుల గుర్తింపు కోసం ఉపయోగించడం నిలిపేయాలని తెలిపింది. మొబైల్ నంబర్లతో ఆధార్ అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని, బ్యాంకు ఖాతాలు, స్కూల్ అడ్మిషన్లకు కూడా ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు నాలుగు రోజుల క్రితం తీర్పు చెప్పింది.
టెలికాం సంస్థలు సహా ప్రయివేటు కంపెనీలు ఆధార్ నంబర్ అడగడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఉడాయ్ భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా తదితర టెలికాం సేవల కంపెనీలకు సర్య్కులర్‌ను పంపింది. టెలికాం సంస్థలు ఆధార్ ఆధారిత ధ్రువీకరణ వ్యవస్థలను నిలిపివేసే, ఆధార్‌ను డీ లింక్ చేసే ప్రణాళికలను అక్టోబరు 15లోగా ప్రణాళిక అందించాలని అడిగింది.

వ్యక్తుల ఫొటో, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్స్ ఉన్న ఆధార్ సమాచారాన్ని ప్రయివేటు కంపెనీలు డిమాండ్ చేయడానికి వీల్లేదని భారత అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. అయితే ఆధార్ రాజ్యాంగ బద్ధమేనని కోర్టు స్పష్టంచేసింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications