అసోంలో కూలిన సుఖోయ్-30 యుద్ధ విమానం: పైలట్లు సురక్షితం

తేజ్‌పూర్: భారత వాయుసేనకు చెందిన సుఖోయ్‌-30ఎంకెఐ యుద్ధవిమానం మంగళవారం మధ్యాహ్నం అసోం రాష్ట్రంలో కూలిపోయింది. తేజ్‌పూర్‌కు 35 కిలోమీటర్ల దూరంలో సంభవించిన ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.

తేజ్‌పూర్‌లోని సలనిబారి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయల్దేరిన ఈ యుద్ధ విమానం కాసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ ప్రమాదం మంగళవారం 12.30గంటల ప్రాంతంలో జరిగినట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

Sukhoi-30 Fighter Aircraft Crashes in Assam; Pilot, Co-Pilot Safe

అయితే ప్రమాదం నుంచి పైలల్, కో పైలట్ సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. కాగా, ఈ ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం

లక్నో: ఢిల్లీ-భువేశ్వర్‌ ఎయిరిండియా విమానం ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో మంగళవారం మధ్యాహ్నం అత్యవసరంగా దిగింది. విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో పైలట్‌ విమానాన్ని లక్నో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. విమానంలో 169 మంది ప్రయాణీకులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+