సునంద హత్య కేసు: శివ్ మీనన్ ప్రకటన, థరూర్‌కి మరోసారి సమన్లు?

న్యూఢిల్లీ: సునంద పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌కు ఢిల్లీ పోలీసులు మరోసారి సమన్లు పంపే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ సోమవారం వెల్లడించారు. ఈ కేసులో శశిథరూర్‌ను త్వరలోనే ప్రశ్నించవచ్చని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

సునంద హత్య కేసులో ఆయనను గతంలోనే ఒకసారి పోలీసులు విచారించారు. ఇటీవలే సునంద కుమారుడు శివ్ మీనన్‌ను స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్(సిట్) ప్రశ్నించి విషయం తెలిసిందే. శివ్ మీనన్ స్టేట్‌మెంట్స్ ఆధారంగా సమాచారాన్ని సేకరించిన పోలీసులు శశిథరూర్‌కి సమన్లు పంపనున్నారు.

Sunanda murder: SIT analyses Shiv Menon's statement, Shashi Tharoor may be quizzed again

సునంద హత్య కేసులో మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు దక్షణి ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో సిట్ ఆఫీస్‌లో శివ్ మీనన్‌ను ఢీల్లీ పోలీసులు విచారించారు. ఈ విచారణలో సునంద పుష్కర్, శశి థరూర్ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనే కోణంలో విచారణ సాగింది.

ఇప్పటి వరకు సునంద పుష్కర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు శశి థరూర్‌తో పాటు, సన్నిహితులు, కుటుంబ సభ్యులను కూడా విచారించారు. ఈ హత్య కేసులో మాజీ సమాజ్ వాదీ పార్టీ అమర్ సింగ్‌తో పాటు, సీనియర్ జర్నలిస్ట్ నళినీ సింగ్‌ను విచారించారు. 52ఏళ్ల సునంద పుష్కర్ గత ఏడాది జనవరి 17న దక్షణి ఢిల్లీలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో అనుమానస్పద స్ధితిలో మరణించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+