ఆ కేసుకు సంబంధించిన రికార్డులన్నీ మాకివ్వండి: సుప్రీంకోర్టు
బిల్కిస్ బానో అత్యాచార కేసులో దోషులు ఇటీవల జైలు నుంచి విడుదల కావడం దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. వారికి రెమిషన్ మంజూరు చేసి.. విడుదల చేయడాన్ని తృణమూల్ కాంగ్రెస్ సవాల్ చేసింది. ఆ పార్టీ ఎంపీ మహువా మొయిత్రాతోపాటు మరో వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిగింది. బిల్కిస్ బానో కేసు విచారణకు సంబంధించిన పూర్తి రికార్డులన్నీ తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2002 నాటి గోద్రా రైలు దహనకాండ అనంతర అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో బిల్కిస్ బానో అత్యాచార ఘటన జరిగింది. ఆమె కుటుంబానికి చెందిన మొత్తం ఏడుగురు వ్యక్తులను దుండగులు హత్య చేశారు. ఈ కేసులో 11 మందికి సీబీఐ ప్రత్యేక కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. నిందితులంతా 15 సంవత్సరాలు కారాగారంలో ఉండటంతో రెమిషన్ కింద ఇటీవలే విడుదలయ్యారు. వీరంతా విడుదలవడాన్ని వివిధ ప్రజా సంఘాలతోపాటు రాజకీయ పార్టీలూ ఖండించాయి. వారి విడుదలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ చేపట్టిన కోర్టు ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

బిల్కిస్ బానో కేసులో నిందితులను విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. వీరి కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. విడుదలైన తర్వాత వీరి వీరి గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవగా కొందరు అజ్ఞాతంలోకి వెళ్లారు. మరికొందరు సమాచారం ఇవ్వకుండా వెళ్లారు. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే వీరంతా అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. గ్రామాల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతోనే వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications