టీ బిల్లు పెట్టండి: సుష్మా, యత్నిస్తున్నాం: కమల్నాథ్

తెలంగాణ బిల్లును శీతాకాలం సమావేశాల్లో ప్రతిపాదించాలని తాను కోరానని, ప్రక్రియ సాగుతోందని, సమయం పట్టే అవకాశాలున్నాయని, బిల్లు మంత్రి వర్గం ఆమోదించి రాష్ట్రపతికి పంపాల్సి ఉందని, రాష్ట్రపతి నుంచి న్యాయశాఖకు రావాలని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారని సుష్మా స్వరాజ్ చెప్పారు. ప్రక్రియ ఈలోగా పూర్తయితే ఈ సమావేశాల్లోనే ప్రతిపాదిస్తామని కమల్‌నాథ్ చెప్పారు.
తెలంగాణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రతిపాదించాలని అన్ని పార్టీల నాయకులు సూచించారని, ఈ సమావేశాల్లోగా ప్రక్రియ పూర్తి కాకపోతే అందరూ కోరితే ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తామని చెప్పామని, అయితే ప్రత్యేక సమావేశాలపై నిర్ణయం తీసుకోలేదని కమల్‌నాథ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ఆయా పార్టీల వైఖరిని బట్టి బిల్లును వ్యతిరేకించవచ్చు లేదా ఆమోదించవచ్చు గానీ బిల్లు మాత్రం ఈ పార్లమెంటు సమావేశాల్లోనే రావాలని అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని కమల్‌నాథ్ చెప్పారు. బిల్లు పార్లమెంటుకు రావడం ముఖ్యమని పార్టీలు అంటున్నాయని ఆయన చెప్పారు. సమావేశాలను తెలంగాణ బిల్లు కోసం పొడిగిస్తారా అంటే ఆయన సమాధానం చెప్పలేదు.












Click it and Unblock the Notifications