ట్రంప్ విద్వేషం వల్లే భారతీయులపై దాడులు: దీప్ రాయ్ తండ్రి, సుష్మ ఇలా...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్వేషపూరిత వ్యాఖ్యల వల్లే భారతీయులపై దాడులు జరుగుతున్నాయని శ్వేతజాతి దుండగుడి కాల్పుల్లో గాయపడ్డ దీప్ రాయ్ తండ్రి సర్ధార్ హర్ పాల్ సింగ్ ఆరోపించారు.
న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్వేషపూరిత వ్యాఖ్యల వల్లే భారతీయులపై దాడులు జరుగుతున్నాయని శ్వేత జాతి దుండగుడి కాల్పుల్లో గాయపడ్డ దీప్ రాయ్ తండ్రి సర్ధార్ హర్ పాల్ సింగ్ అన్నారు.
తన కొడుకు చేతుల్లోకి బుల్లెట్ దూసుకెళ్ళిందని ఆసుపత్రిలో కోలుకొంటున్నాడని ఆయన చెప్పాడు.అయితే ప్రాణాపాయం తప్పిపోయిందన్నారాయన.
కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ బాధిత కుటుంబంతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకొంది. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు.

వాషింగ్టన్ రాష్ట్రంలోని కెంట్ నగరంలోని శ్వేత జాతి దుండగుడు జాతివివక్షతతో మీ దేశానికి వెళ్ళి పో అటూ సిక్కు వ్యక్తి దీప్ రాయ్ పై ఆయన ఇంటి బయటే కాల్పుల్లో జరిపాడు. ఈ ఘటనలో దీప్ రాయ్ తీవ్రంగా గాయపడ్డాడు.
అమెరికాలో భారతీయుల పట్ల వరసుగా జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ విచారం వ్యక్తం చేశారు. దీప్ రాయ్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షను వ్యక్తం చేశారు.
అమెరికాలో కాల్పుల్లో మరణించిన హర్నీస్ పటేల్ కుటుంబానికి ఆమె సానుభూతిని తెలిపారు. హర్నీష్ దారుణహత్య తనను కలిచివేసిందన్నారు సుష్మా.. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ లో పోస్టు చేశారు.ఆయన కుటుంబ సభ్యులతోనూ ఆమె మాట్లాడారు. శ్రీనివాస్ కూచిబొట్ల హత్య తర్వాత వరుసగా భారతీయులపై దాడులు సాగుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications