Arshdeep Singh: నక్కతోక తొక్కాడు మరి: షమీని కాదని..: క్యాచ్ డ్రాప్ చేయడు కదా!!

దుబాయ్: ఆసియా కప్ 2022 మెగా క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. శ్రీలంక ఛాంపియన్‌గా అవతరించింది. తనకంటే ఎన్నో రెట్లు బలమైన పాకిస్తాన్‌ను మట్టి కరిపించింది లంక. పెను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిన పరిస్థితుల్లోనూ లంకేయులు తమ కిల్లింగ్ ఇన్‌స్టింక్ట్‌ను పోగొట్టుకోలేదు. సుదీర్ఘ విరామం తరువాత ఓ మేజర్ టోర్నమెంట్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. తమ దేశ జాతీయ జట్టుకు మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు.

సూపర్ 4 దశలోనే..

సూపర్ 4 దశలోనే..

ఈ ఆసియా కప్ టోర్నమెంట్ మాత్రం టీమిండియా అభిమానులకు చేదు అనుభవాలను మిగిల్చింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆసియా కప్ టోర్నమెంట్‌లో అడుగు పెట్టిన భారత్.. సూపర్ 4 దశలోనే వెనుదిరిగింది. గ్రూప్ దశలో వరుసగా రెండు విజయాలతో సూపర్ ఫామ్‌లో కనిపించినప్పటికీ.. సూపర్ 4 దశలో చతికిల పడింది. మూడు మ్యాచ్‌లల్లో రెండింట్లో ఓడింది. స్వదేశానికి తిరుగుముఖం పట్టింది. మూడో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగింది గానీ అప్పటికే ఫైనల్స్ చేరే అవకాశాన్ని కోల్పోయింది.

పరాజయ భారం నుంచి..

పరాజయ భారం నుంచి..

ఇక ఈ పరాజయం మిగిల్చిన పరాభవం నుంచి తేరుకుంటోంది టీమిండియా. ఇక టీ20 ప్రపంచకప్ 2022 మెగా ఈవెంట్ కోసం సమాయాత్తమౌతోంది. ఆస్ట్రేలియా గడ్డపై సాగే టోర్నీ ఇది. అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆరంభమౌతాయి. 22వ తేదీ నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు మొదలవుతాయి. ఇక్కడ కూడా భారత్-పాకిస్తాన్ ఎదురెదురు పడబోతోన్నాయి. 23వ తేదీన మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం వేదకిగా చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ షెడ్యూల్ అయింది.

జట్టు ఇదే..

జట్టు ఇదే..

ఈ టోర్నమెంట్ ఆడబోయే జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వాన్ని వహించబోతోన్నాడు. కేఎల్ రాహుల్ వైస్ కేప్టెన్. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ ఎంపికయ్యారు.

 అర్ష్‌దీప్ సింగ్‌ సెలెక్ట్..

అర్ష్‌దీప్ సింగ్‌ సెలెక్ట్..

ఊహించినట్టే- టీ20 ప్రపంచ కప్ ఆడబోయే జట్టులో ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కింది. పాకిస్తాన్‌తో గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిపోవడానికి ప్రధాన కారకుడిగా, ఖలిస్తానీగా ఆరోపణలు, విమర్శలను ఎదుర్కొన్న తరువాత అర్ష్‌దీప్ సింగ్‌కు తోటి ప్లేయర్లు, అభిమానులతో పాటు బీసీసీఐ కూడా అండగా నిలిచింది. అతనిలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా- అత్యంత కీలకమైన టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు అతణ్ని సెలెక్ట్ చేసింది.

 స్టాండ్‌బైగా షమీ..

స్టాండ్‌బైగా షమీ..

ఈ క్రమంలో సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీని సైతం బీసీసీఐ పక్కన పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మహ్మద్ షమీని జట్టులోకి తీసుకుంది గానీ- అది స్టాండ్‌బైగా మాత్రమే. షమీతో పాటు శ్రేయాస్ అయ్యర్, స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్, మిడిలార్డర్ బ్యాటర్ దీపక్ చాహర్‌ను కూడా స్టాండ్‌బై ప్లేయర్ల జాబితాలో పెట్టింది.

ఎన్సీఏకు రిపోర్ట్..

ఎన్సీఏకు రిపోర్ట్..

టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ముగిసిన వెంటనే తొలుత ఆస్ట్రేలియా, ఆ తరువాత దక్షిణాఫ్రికాతో భారత జట్టు టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌లను ఆడాల్సి ఉంది. ఈ రెండింటి కోసం కూడా జట్టును ప్రకటించింది బీసీసీఐ. అర్ష్‌దీప్ సింగ్ ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికయ్యాడు గానీ.. దక్షిణాఫ్రికాతో టీ20 ఇంటర్నేషనల్స్‌కు దూరం అయ్యాడు. అతన్ని తీసుకోలేదు. విశ్రాంతి ఇచ్చింది. అర్ష్‌దీప్‌తో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బౌలింగ్ బ్యాక్‌బోన్ భువనేశ్వర్ కుమార్‌కు కూడా చోటు దక్కలేదు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వారు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+