కావేరి దెబ్బ: జయలలిత అంటే భయం అందుకే ?
చెన్నై: కావేరీ జలాల వివాదంలో తమిళనాడు చేపట్టిన బంద్ సందర్బంగా ప్రతిపక్షాలు వెనక్కి తగ్గాయి. పెద్ద ఎత్తును ఆందోళనలు చేస్తామని ముందుగానే ప్రకటించిన ప్రతిపక్షాలు బంద్ సందర్బంగా శాంతియుతంగా ఆందోళనలు చేసి సైలెంట్ అయిపోయారు.
ప్రజల ఆస్తులకు నష్టం జరుగుతుంటే మీరేం చేస్తున్నారని కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో శుక్రవారం తమిళనాడు బంద్ జరిగింది. బంద్ సందర్బంగా 1.8 లక్షల మంది పోలీసులు బందోబస్తులో పాల్గోన్నారు.
ఎవరైనా హింసాత్మకంగా బంద్ నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జయలలిత పోలీసులకు సూచించారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిపక్షాల మీద కేసులు పెడుతారనే భయం నాయకులకు ఉంది.

ఇక బంద్ సందర్బంగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు హాని జరిగితే జయలలిత సామాన్యంగా వదలరని భావించిన ప్రతిపక్షాలు కొంత వెనక్కి తగ్గాయి. రైల్ రోకోలు, ధర్నాలు నిర్వహించినా ఎక్కడ హింస చోటు చేసుకోకుండా జాగ్రత్తగా బంద్ నిర్వహించి ఊపిరిపీల్చుకున్నారు.
గతంలో తమిళనాడులో బంద్ లు జరిగిన సమయంలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల మీద ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు జయలలిత పక్కా ఆధారాలతో అరెస్టు చేసి జైలుకు పంపిస్తారని ఆందోళనకారులు భయపడ్డారు.
కన్నడిగుల మీద దాడి చెయ్యకుండా పూర్తి స్థాయిలో భద్రత కల్పించడంతో తమిళనాడు ప్రభుత్వం, పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. కేవలం జయలలిత మీద భయంతోనే ఆందోళనాకారులు హింసకు చోటు ఇవ్వకుండా శాంతియుతంగా బంద్ నిర్వహించారు.












Click it and Unblock the Notifications