జయలలితపై వదంతులు: 40 మందిపై కేసులు, యూఎస్ లో ?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత ఆరోగ్యంపై వదంతులు పుట్టించిన 40 మందిపై చెన్నై నగర పోలీసులు కేసులు నమోదు చేశారు. వదంతులు పుట్టించిన వారిమీద కఠిన చర్యలు తీసుకోంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.
జయలలిత ఆరోగ్యం విషయంలో అవాంచనీయ ఘటనలు చోటుచేసుకునేలా వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ల ద్వార కొందరు అసత్య ప్రచారం చేశారు. ఇలాంటి ప్రచారం చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే నాయకులు చెన్నై నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
మొత్తం 40 ఫిర్యాదులు చేశారని, 40 మంది మీద కేసు నమోదు చేశామని చెన్నైనగర అదనపు పోలీసు కమిషనర్ (శాంతి భద్రతల విభాగం) శంకర్ మీడియాకు చెప్పారు. సోషల్ మీడియా సర్వర్ అమెరికాలో ఉన్నందున నిందితులను గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుందని అన్నారు.

వదిలిపెట్టం
సీఎం జయలలిత ఆరోగ్యంపై వదంతులు వ్యాపించడానికి కారణం అయిన వారిని ఎట్టిపరిస్థితిలో వదిలిపెట్టమని చెన్నై నగర అదనపు పోలీసు కమిషనర్ శంకర్ చెప్పారు. ఇప్పటికే కొందరి చిరునామాలు గుర్తించామని ఆయన వివరించారు.

సంబరాలు చేసుకుంటున్నారు
అమ్మ జయలలిత ఆర్యోగం కుదటపడుతుందని, ఆమె వైద్యసేవలకు పూర్తిగా సహకరిస్తున్నారని అపోలో వైద్యులు స్పష్టం చేయడంతో గత 10 రోజుల నుంచి ఆందోళన చెందుతున్న కార్యకర్తలు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు.

అపోలో దగ్గర ప్రశాంతం
అమ్మ ఆరోగ్యం గురించి వదంతులు రావడంతో ఆదివారం వరకు చెన్నై నగరంలోని అపోలో ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే జయలలిత ఆరోగ్యం గురించి అపోలో ఆసుపత్రి వైద్యులు క్లారిటీ ఇవ్వడంతో సోమవారం అక్కడ పరిస్థితి శాంతియుతంగా ఉంది.

పరుగో పరుగు
కర్ణాటకలోని అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు, జయలలిత అభిమానులు వేలాధిమంది చెన్నైకి వెళ్లారు. అపోలో ఆసుపత్రి దగ్గర ఆదివారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

కరుణానిధి రాజకీయం చేస్తున్నారు
డీఎంకే అధినేత ఎం. కరుణానిధి సీఎం జయలలిత ఆరోగ్యం విషయంలో రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి, అన్నాడీఎంకే నాయకులు వలర్మతి ఆరోపించారు. అమ్మ త్వరగా కొలుకుంటారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి, సినీనటి సీఆర్. సరస్వతి చెప్పారు.

అమ్మ ఫోటోలతో
తమిళనాడు సీఎం జయలలిత కొలుకుంటున్నారని తెలుసుకున్న అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు జయలలిత ఫోటోలు చేతపట్టుకుని డ్యాన్స్ లు చేశారు. అపోలో ఆసుపత్రి దగ్గర మిఠాయిలు పంచిపెడుతున్నారు.

జాతీయ మీడియా పరుగు
జయలలిత ఆరోగ్యంపై వదంతులు వ్యాపించడంతో మూడు రోజుల క్రితం జాతీయ మీడియా చెన్నైలో వాలిపోయింది. అమ్మ అరోగ్యంగా ఉన్నారని ప్రముఖులు స్పష్టం చేసినా జాతీయ మీడియా సభ్యులు మాత్రం చెన్నైలోనే మకాం వేశారు.












Click it and Unblock the Notifications