తమిళ సినీ రంగం దెబ్బ: దిగివచ్చిన సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వంకు చాన్స్, శివాజీ గణేశన్!

చెన్నై: బహుబాష నటుడు, తమిళ సినీ రంగం అలనాటి మహానటుడు శివాజీ గణేశన్ మెమోరియల్ భవనం ప్రారంభోత్సవం వివాదానికి చివరికి తెరపడింది. తమిళనాడు ఉప ముఖ్య మంత్రి దివంగత నటుడు శివాజీ గణేశన్ మెమోరియల్ భవనంతో పాటు ఆయన విగ్రహావిష్కరణకు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

అలనాటి మహానటుడు శివాజీ గణేశన్ మెమోరియల్ భవనం, విగ్రహావిష్కరణకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దూరమై కేవలం మంత్రులు మాత్రమే హాజరుకావడానికి సిద్దం కావడంతో వివిధ రాజకీయ పార్టీలు మండిపడ్డాయి.

మా నాన్నను అవమానిస్తున్నారని శివాజీ గణేశన్ కుమారుడు, ప్రముఖ నటుడు ప్రభు ఇటీవలే తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారు. సీఎం, డీసీఎం శివాజీ గణేశన్ మెమోరియల్ భవనం, ఆవిష్కరణకు హాజరుకాలేకపోతున్నామని ప్రకటించడంతో ఆయన అభిమానులు, తమిళ సినీరంగ ప్రముఖులు బహిరంగంగానే విమర్శించారు.

Tamil Nadu CM cleared the air, Panneerselvam to inaugurate Sivaji Ganesan memorial

ఈ నేపథ్యంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అనివార్య కారణాల వలన ఈ కార్యాక్రమానికి తాను హాజరుకాలేకపోతున్నానని, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కచ్చితంగా హాజరు అవుతారని మీడియాకు చెప్పారు.

అక్టోబర్ 1వ తేదీన పన్నీర్ సెల్వం శివాజీ గణేశన్ మెమోరియల్ భవనం, ఆయన స్మారక విగ్రహాం ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి జయకుమార్ అధ్యక్షత వహించనున్నారు. తమిళనాడుకు చెందిన పలువురు మంత్రులు హాజరుకానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+