జయలలిత కోలుకోవాలి: సిద్దు, హోమాలు, పూజలు
బెంగళూరు/చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య శుక్రవారం ట్విట్ చేశారు. ఆమె ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.
ఏఐఏడీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పూజలు, హోమాలు చేస్తున్నారు. జయలలిత అభిమానులు ఆలయాల్లో బారులు తీరారు.
పోర్లు దండాలు పెడుతూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. చెన్నై నగరంలోని అన్నాడీఎంకే కార్పొరేటర్లు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అన్ని మతాలకు చెందిన వారు ఆలయాల్లో ప్రత్యే పూజలు, హోమాలు చేస్తున్నారు.

తీవ్రజ్వరం, డీహైడ్రేషన్ కారణంగా జయలలిత గురువారం రాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. సుబ్బయ్య విశ్వనాథన్ అనే చీఫ్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో వైద్యం చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని ఆయన వివరించారు.
జయలలిత ఆరోగ్యం నిలకడగా ఉందని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి ప్రాంగణంలో 500 మందికి పైగా పోలీసులు మొహరించారు. ఆసుపత్రి వైపు వెళ్లే అన్ని మార్గాలు మూసివేశారు.












Click it and Unblock the Notifications