Target: ఆ రెండు పేర్లు వినపడితే కాల్చిపారేస్తున్నారు, మార్కెట్ లోనే లేపేశారు. ఏం జరిగింది ?
పూల్వామాలో రెండు వర్గాల పేర్లు వినపడితే ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. రెండు వర్గాలను టార్గెట్ చేసుకుంటున్న ఉగ్రవాదులు ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తారో అని అక్కడి ప్రజలు హడలిపోతున్నారు.
జమ్మూ/కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఆదివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన వ్యక్తి మరణించాడు. లోయ ప్రాంతంలో మరోసారి పండిట్ లను లక్ష్యంగా చేసుకుని హత్య చేశారు. హత్యకు గురైన పండిట్ ను సంజయ్ శర్మగా గుర్తించారు. సంజయ్ శర్మ స్థానిక మార్కెట్‌కు వెళుతుండగా ఉగ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు, ఆ తరువాత సంజయ్ శర్మాను ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స విఫలమై ఆయన మరణించాడని తెలిసింది. హత్యకు గురైన సంజయ్ శర్మ జమ్మూకశ్మీర్‌లోని ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడని తెలిసింది.

జమ్మూ కాశ్మీర్ పోలీసులు ?
కాశ్మీర్ పండిట్ హత్యను జమ్ము కాశ్మీర్ పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. ఉగ్రవాదులను అరెస్టు చేయడానికి తాము ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు పోలీసు అధికారులు చెప్పారు. స్థానిక మార్కెట్‌కు వెళ్తున్న పుల్వామాలోని అచ్చం నివాసి కాశీనాథ్ శర్మా కుమారుడు సంజయ్ శర్మా అనే వ్యక్తి మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సంజయ్ శర్మా మృతి చెందాడు. సాయుధ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు తెలిసింది. మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని కాశ్మీర్ పోలీసు అధికారులు ట్వీట్ చేశారు.

ముందుకు వచ్చిన కాంగ్రెస్
జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా సంజయ్ శర్మా హత్యను తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనను హృదయ విదారకం అని, ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా కాంగ్రెస్ అభివర్ణించింది. పండిట్ ను దారుణంగా హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీుకోవాలని, వారికి కఠిన శిక్ష విధించాలని జమ్ము కాశ్మీర్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అమాయకుల హత్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులను పట్టుకోవాలని పోలీసు అధికారులకు మనవి చేశారు.

ఆ రోజు ఏం జరిగింది ?, పెర్ప్యూమ్ బాంబు
2022 మే 12వ తేదీన న బుద్గామ్ జిల్లాలో కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు హత్య చేశారని ఆరోపిస్తూ కాశ్మీరీ పండిట్‌లు గత కొన్ని నెలలుగా లోయలో నిరసనలు చేస్తున్నారు. ఇంతలో మరొక పండిట్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు హత్య చెయ్యడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫిబ్రవరి ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్‌లో మొదటిసారిగా పెర్ఫ్యూమ్ బాంబు కనుగొనబడింది. కేంద్రపాలిత ప్రాంతంలో ఇలాంటి బాంబును స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని జమ్మూ కాశ్మీర్ పోలీసు చీఫ్ చెప్పారు. పెర్ఫ్యూమ్ ఐఈడీని స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి కావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోతున్నారు.

ఎప్పటికి అదిజరగదు ?
జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దిల్‌బాగ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఆరిఫ్ అనే ఉగ్రవాది పాకిస్థానీ ఉగ్రవాదులతో కలిసి పని చేస్తున్నాడని, వాళ్ల ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నాడని చెప్పారు. గత ఏడాది మేలో వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన బాంబు దాడిలో నలుగురు వ్యక్తులు మరణించగా, 24 మంది గాయపడిన ఘటనలో అతని ప్రమేయం ఉందని ఒప్పుకున్నాడు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్థాన్‌కు పేరుంది. అలాగే జమ్మూ కాశ్మీర్‌లో ప్రజల మధ్య మతపరమైన విభజనను సృష్టించాలని పాకిస్తాన్ ఉగ్రవాదులు కోరుకుంటున్నారని, అది ఎప్పటికి జరగదని జమ్ము కాశ్మీర్ పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications