వీడియో: ఢిల్లీ విమానాశ్రయంలో తరుణ్ తేజ్‌పాల్

న్యూఢిల్లీ: మహిళా జర్నలిస్టుపై లైగింక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్‌ తేజ్‌పాల్‌ ఢిల్లీ విమానాశ్రయంలో దర్శనమిచ్చాడు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఆయన నివాసానికి గోవా పోలీసులు శుక్రవారం ఉదయమే చేరుకున్నారు. అయితే, ఆయన జా కనిపించలేదు. ఆయన ఎక్కడున్నారనే విషయం చెప్పడానికి తరుణ్ తేజ్‌పాల్ భార్య గీతన్ బాత్రా నిరాకరించారు.

ఆయనకు పానాజీ కోర్టు శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన అరెస్టుకు బ్రేక్ పడింది. ఆయన గోవాకు చేరుకోవడానికి ఢిల్లీలో విమానం ఎక్కుతున్నట్లు సమాచారం. ఇండిగో విమానంలో ఆయన గోవాకు చేరుకుంటున్నారు.

Tarun Tejpal spotted at Delhi Airport

తరుణ్ తేజ్‌పాల్ మధ్యాహ్నం గోవా పోలీసుల ముందు విచారణ నిమిత్తం హాజరయ్యే అవకాశం ఉంది. విచారణ తర్వాత ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. ఆయన అరెస్టును తప్పించుకోలేరని అంటున్నారు.

లైంగిక దాడికి సంబంధించిన ఆరోపణలు వచ్చిన తర్వాత తేజ్‌పాల్ మొదటి సారి బయటి ప్రపంచానికి కనిపించారు. తనకు సమన్లు అందాయని, తాను గోవాకు వెళ్తున్నానని ఆయన చెప్పారు. తేజ్‌పాల్ కాస్తా ఊరట పొందినట్లు కనిపించారు. తేజ్‌పాల్ ప్రయాణించే విమానం సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు గోవా చేరుకుంటుంది.

<center><center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/sF9xS8vTXNU?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+