రాష్ట్రపతికి టీ బిల్లు: రాష్ట్రపతి పాలనకు సోనియా ఓకె

న్యూఢిల్లీ: ఎట్టకేలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ బిల్లు చేరింది. పార్లమెంటులో ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు గురువారం రాష్ట్రపతి కార్యాలయానికి చేరుకుంది. రెండు రోజుల్లో రాష్ట్రపతి తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశమునట్లు సమాచారం.

కాగా, తెలంగాణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొంది పది రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు రాష్ట్రపతి ముందుకు రాకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై పలువురు రాష్ట్ర నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు తెలంగాణ బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరుకుంది.

Telangana bill reaches president

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకే కేంద్రం మొగ్గు చూపుతుందన్న వార్తలకు తెరదించుతూ రాష్ట్రపతి పాలనకే సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేలకు సోనియా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఉదయం 10:45 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు ఆమోదం పలికే అవకాశముంది. ఆ వెంటనే రాష్ట్రపతి పాలనపై కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిన ఆ ఫైల్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందుకు వెల్లనుందని విశ్వసనీయ సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+