అసోంలో ఆంధ్రా ఇంజనీర్ కిడ్నాప్: బోడో మిలిటెంట్స్ పనే
డిస్పూర్: అసోంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ తెలుగు ఇంజనీర్‌ను బోడో మిలిటంట్స్ కిడ్నాప్ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన అంకన్ రావు అనే ఆంధ్రా ఇంజనీర్‌ను మిలిటెంట్స్ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు అపహరించారు. ఇతను బొల్లినేని శ్రీనయ్య అండ్ కంపెనీలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.
కాగా, బోడో మిలిటెంట్స్ గతంల పైడి రాజు అనే తెలుగు ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసి ఆ తర్వాత విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అంకన్ రావును కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ విషయం తెలిసిన అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

గతంలో అసోంలోనే అపహరణకు గురైన ఆంధ్రా ఇంజనీర్ పైడిరాజును బోడో రెబల్ తీవ్రవాదాలు ఫిబ్రవరి 27న రాత్రి విడుదల చేశారు. అంతకుముందు పది రోజుల క్రితం ఆయనను బోడో రెబల్స్ కిడ్నాప్ చేశారు. పైడి రాజును అపహరించిన బోడో తీవ్రవాదులు ఐదు కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అపహరణ విషయం తెలుసుకున్న అస్సాం పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పైడిరాజుకు విముక్తి కలిగింది.












Click it and Unblock the Notifications