టెర్రర్ జర్నీ: ఫుట్ బోర్డింగ్ ప్రయాణం చేశారు... రైలు నుంచి జారి పడి చనిపోయారు
చెన్నై: ప్రభుత్వాలు ఎన్నిసార్లు చెప్పినా యువత మాత్రం మారనంటోంది. ఫుట్ బోర్డు పై ప్రయాణం ప్రమాదకరం అని హెచ్చరికలు పెట్టిన వాటిని మాత్రం యువత పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రాణాలు కోల్పోయి కన్నవారికి శోకం మిగులుస్తోంది. ఇప్పటికే బస్సుల్లో ఫుట్ బోర్డింగ్ పై ప్రయాణిస్తూ చాలామంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ కళ్లారా చూసి కూడా మాకేం కాదులే అన్న ధీమాతో యువత ఇంకా సర్కస్ ఫీట్లు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటోంది.

తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలో ఫుట్ బోర్డింగ్ పై ప్రయాణం చేసి ఐదుమంది యువకులు మృతి చెందారు. అప్పటి వరకు పక్కన వారితో మాట్లాడుతూ ప్రయాణం కొనసాగించిన వీరు ఒక్క క్షణంలోనే ప్రాణాలను వదిలారు. చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సెయింట్ థామస్ రైల్వే స్టేషన్‌లో ఓ లోకల్ ట్రైన్ ప్రయాణికులతో కిక్కిరిసింది. దీంతో చాలామంది ఫుట్‌బోర్డుపై నిల్చొని ప్రయాణం చేశారు. రైలు వేగం అదుకుంది. కొంత దూరం వెళ్లాక కరెంటు స్తంభం వారికి తగలడంతో రైలులో నుంచి కింద పడ్డారు. రైలు అప్పటికే వేగం మీద ఉండటంతో జారికింద పడ్డ వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications