ఎయిర్ ఇండియాలో అన్నం, పప్పు, గరం చాయ్
ముంబై: ఎయిర్ ఇండియా సంస్థ తన ప్రయాణికులకు భారతీయ వంటకాలను రుచి చూపించేందుకు సర్వం సిద్దం చేసింది. ఇప్పటికే ముంబై - న్యూఢిల్లీ మార్గంలో సంచరిస్తున్న ఎయిర్ ఇండియా విమానాల్లో ఈ కొత్త మెనును అందుబాటులోకి తీసుకువచ్చారు.
భారతీయుల సాధారణ భోజనం తాలీ, కుల్హద్ మసాలా చాయ్ లను ప్రయాణికులకు అందిస్తున్నారు. ప్రయాణికులకు అన్నం, పప్పు వడ్డిస్తున్న తొలి విమాన సర్వీసుగా ఎయిర్ ఇండియా సంస్థ నిలిచింది.
సోమవారం నుంచి ప్రారంభమైన ఈ మెనుపై ఇప్పటికే మంచి స్పందన వస్తున్నదని ఎయిర్ ఇండియా ఎండీ అశ్వని లోహాని తెలిపారు. ప్రయాణికుల స్పందన, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని అతి త్వరలో మిగతా సర్వీసులకు ఈ మెను విస్తరిస్తామని చెప్పారు.

తాలీలో భాగంగా అన్నం, పప్పు, ఓ కూర, రోటీ, పనీర్ లేదా చికెన్, పెరుగుతో పాటు మొత్తం ఏడు ఫుడ్ ఐటమ్స్ ఎంచుకునే వీలు ఉందని ఆయన వివరించారు. సాధారణంగా ఫ్లైట్ లో అందించే భోజనం కంటే తాలీని వేడి వేడిగా వడ్డించేందుకు కాస్త సమయం పడుతుందని క్రూ మెంబర్లు అంటున్నారు.
సాధారణంగా బిజినెస్ క్లాస్ లో అందించే భోజన పదార్థాలు ఒకే సారి వేడి చేసే వీలుంది. తాలీలో మాత్రం అన్ని పదార్థాలు వేరు వేరుగా వేడిచేయాల్సి వస్తుందని వారు అంటున్నారు. మొత్తం మీద ఎయిర్ ఇండియా విమానంలో అన్నం, పప్పు వడ్డించడంతో భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications