అలా కాకపోతే ఇలా, తెరమీదకు ఆపరేషన్ కమల ?, లైఫ్ అండ్ డెత్ సమస్య, టచ్ లో ?
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది ? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పలు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం కష్టం అని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి.
మే 13వ తేదీన ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయిన తరువాత ఏం చెయ్యాలో అని బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నారని వెలుగు చూసింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఇప్పటికే బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోందని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. కర్ణాటకలో ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేక పవనాలు ఎక్కువగా ఉన్నాయని వెలుగు చూసింది. మాదే అధికారం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ధీమాగా ఉండటంతో అప్పుడే బీజేపీ నాయకుల్లో వనుకు మొదలైయ్యింది.
బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే బీజేపీ పాతపాట పాడాలని డిసైడ్ అయ్యిందని సమాచారం. ఆపరేషన్ కమలాను మరోసారి తెరమీదకు తీసుకురావడానికి బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ దిశ అడుగులు వేస్తున్నారని వెలుగు చూసింది.
ఇప్పటికే జేడీఎస్ పార్టీలో కచ్చితంగా గెలిచే నలుగురు నాయకులతో బీజేపీ పెద్దలు చర్చలు జరిపారని కన్నడ మీడియా అంటోంది. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తే జేడీఎస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది ?, జేడీఎస్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎలాంటి లాభాలు, ఎలాంటి సమస్యలు ఉంటాయి అని బీజేపీ హైకమాండ్ ఇప్పటికే కర్ణాటక బీజేపీ నాయకులతో చర్చించారని తెలిసింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సంపాధించుకున్నా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేకపోయింది. అయితే ఇప్పుడు బీజేపీ అన్ని సీట్లు గెలుచుకునే అవకాశం లేదని వెలుగు చూసింది. 2018లో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ నాయకులు ఆపరేషన్ కమలాను తెరమీదకు తెచ్చి చివరికి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
బీజేపీలో టిక్కెట్లు దక్కకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ టిక్కెట్లు సంపాధించి ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులతో కూడా బీజేపీ పెద్దలు చర్చలు జరపడానికి సిద్దం అయ్యారని తెలిసింది. దక్షిణ భారతదేశంలో బలంగా ఉన్న కర్ణాటకలో అధికారం కోల్పోతే పరిస్థితులు తారుమారు అయ్యే అవకాశం ఉందని ఇటీవల అమిత్ షా కొందరు నాయకులతో అన్నారని తెలిసింది.
ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చిన అమిత్ షా ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అందరూ సిద్దంగా ఉండాలని కర్ణాటకలోని కొందరు బీజేపీ పెద్దలకు సూచించారని తెలిసింది. అధికారం దూరం కాకుండా ఉండాలంటే ఆపరేషన్ కమలా మనకు దిక్కు అని బీజేపీ హైకమాండ్ బావించిందని తెలిసింది. ఆపరేషన్ కమలాను పక్కాప్లాన్ గా చెయ్యడానికి ఇప్పుడు బీఎస్. యడియూరప్ప సీఎం రేసులో లేకపోవడం కూడా బీజేపీ నాయకుల పెద్ద మైనస్ పాయింట్ అయ్యింది.
-
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications