పంక్షన్ కు వెళ్లిన బావ, మరదలు బాయ్ ఫ్రెండ్ కనపడ్డాడు, తొడలో పొడిచి అసలు లేకుండా చేశాడు !

అమ్మాయి విషయంలో ప్రారంభమైన గొడవ హత్యగా మారిన ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హోసదుర్గ తాలూకా ఎన్‌ఎన్‌ కట్టే గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో ఇల్లంతా రక్తసిక్తమై భయానక దృశ్యాలు కనిపించాయి. ఎన్ కట్టె గ్రామానికి చెందిన మనోజ్ నాయక్ అనే యువకుడు తన సొంత గ్రామానికి చెందిన రంజితాబాయి అనే యువతిని కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు.

ఈ విషయమై హిరియూరు తాలూకా సోమేనహళ్లి గ్రామానికి చెందిన రంజితాబాయి సోదరి శివరంజిని భర్త రఘునాయక్‌ కు, మనోజ్‌ నాయక్‌ (21)తో గొడవ జరిగింది. రంజితాబాయితో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇది సరికాదు అంటూ పలుమార్లు రఘునాయక్ గొడవ పడ్డాడు. ఇదంతా పట్టించుకోని మనోజ్ నాయక్, అతని ప్రియురాలు రంజితాబాయితో మాట్లాడుతూనే ఉన్నాడు.

 The brother-in-law of the girl who stabbed to death a young man who was roaming around a lot with his girlfriend

మనోజ్ కుమార్, రంజితాబాయి పరస్పరం మాట్లాడుకోవడం రఘునాయక్ గమనించారు. ఇదే అదునుగా పెట్టుకున్న నిందితుడు రఘునాయక్ మనోజ్ మీద దాడి చేశాడు. తరువాత గురువారం ఎన్‌ఎన్‌ కట్టె గ్రామంలో జరిగిన పండుగకు వచ్చిన రఘునాయక్ రోడ్డుపై వెళ్తున్న మనోజ్‌ను ఇంటికి పిలిపించి నా మరదలితో మాట్లాడితే చేంపేస్తానని బెదిరించాడు. ఇలా ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో నిందితులు రఘు నాయక్, రమేష్ నాయక్, రవినాయక్, ఇందిరాబాయి, శివనాయక్, సుమిత్రాబాయి కలిసి మనోజ్ నాయక్ మీద దాడి చేశారు. ఆ

ఈ సమయంలో నిందితుడు రఘునాయక్ కత్తితో మనోజ్ నాయక్ తొడపై పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో మనోజ్ నాయక్ ను శ్రీరాంపూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మనోజ్ నాయక్ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

 The brother-in-law of the girl who stabbed to death a young man who was roaming around a lot with his girlfriend

ఈ సంఘటన హోస్‌దుర్గా తాలూకా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగగా, కేసు నమోదైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే ప్రధాన నిందితుడు రఘు నాయక్‌తోపాటు నలుగురు నిందితులు అదృశ్యమయ్యారు. పట్టణంలోనే మకాం వేసిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+