రైల్వే ట్రాక్ పక్కలో మహిళ శవం, ఆమె చేతి మీద టూటూ పట్టించింది, యజమానితో ?

చనిపోయిన మహిళ శరీరం మీద ఉన్న పచ్చబొట్టు ఆ మృతదేహం ఆచూకి గుర్తించడంలో పోలీసులకు సహాయపడింది. లక్ష్మీబాయి గాడివాడర్ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయిందని పోలీసు అదికారుల విచారణలో వెలుగు చూసింది. ఇంటి నుంచి వెళ్లి మాయం అయిన మహిళ శవమై కనిపించడం, ఆమె శరీరం మీద ఫోన్ నెంబర్ పచ్చబొట్టు రూపంలో ఉండటం హాట్ టాపిక్ అయ్యింది.

ముంబాయిలో లక్ష్మీబాయి పని చేస్తున్నది. నిరక్షరాస్యురాలు కావడంతో యజమాని మొబైల్ నంబర్ ఆమెకు గుర్తుకు ఉండటంలేదు. యజమానికి కాల్ చేయాల్సి వస్తే లక్ష్మీబాయ్ కి ఆ ఫోన్ నంబర్ గుర్తుకు రాదు. అందుకే తనకు ఉద్యోగం ఇచ్చిన యజమాని మొబైల్ నంబర్‌ను లక్ష్మీబాయి ఆమె చేతి మీద టాటూ వేయించుకుంది. ఇప్పుడు అదే టాటూ ఆమె మృతదేహాన్ని గుర్తించడానికి సహాయపడుతుందని పోలీసులు అన్నారు.

The police collected the details of the woman based on the tattoo on her body

కుర్లా రైల్వే స్టేషన్‌లోని ట్రాక్‌కు సమీపంలో పాక్షికంగా కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. మహిళ మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ప్రాథమిక దశలో అది గుర్తుతెలియని మహిళ మృతదేహమని పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తరువాత మృతదేహాన్ని నిశితంగా పరిశీలించగా ఆమహిళ కుడి చేతిపై కొన్ని సంఖ్యలు కనుగొన్నారు.

ఆ నంబర్లు సరిపోలడంతో అది మొబైల్ నంబర్ అయి ఉండొచ్చని పోలీసులకు అనుమానం వచ్చింది.

పోలీసులు ఆ నంబర్‌కు ఫోన్ చేయగా మృతురాలు లక్ష్మీబాయి గాడివాడర్‌గా పోలీసలు గుర్తించారు. మహిళ గురించి ఆమె యజమాని పోలీసులకు చెప్పాడు. లక్ష్మీబాయి నిరక్షరాస్యురాలు కావడంతో తన మొబైల్ నంబర్‌ను టాటూ వేయించుకున్నట్లు కాల్‌ను అందుకున్న ఆమెకు ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి పోలీసులకు చెప్పాడు.

The police collected the details of the woman based on the tattoo on her body

లక్ష్మీబాయి కుర్లా రైల్వేస్టేషన్ సమీపంలోకి ఎందుకు వెళ్లిందో తెలియడం లేదని ఆమె యజమాని చెప్పడంతో పోలీసులు అతని వాంగ్మూలం నమోదు చేశారు. వినోవా ఏరియాలో నివాసం ఉంటున్న మహిళ కనిపించడం లేదని భావే నగర్, కుర్లా పోలీస్ స్టేషన్‌లో లక్ష్మీబాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. లక్ష్మీ బాయి సెంట్రల్ ముంబాయిలోని తూర్పు ప్రాంతంలో పని చేసింది. అయితే లక్ష్మీబాయి ఎలా చనిపోయింది ?, ఆమెను ఎవరైనా హత్య చేశారా ?, ఆమెకు పని ఇచ్చిన యజమానికి ఏమైనా సంబంధం ఉందా, లేక తెలిసినవాళ్లు ఎవరైనా హత్య చేశార అనే కోణంలో పోలీసు అధికారులు ఆారా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+