కరకరలాడే రెస్టారెంట్ స్టైల్ 'ఫ్రెంచ్ ఫ్రైస్'.. ప్రిపరేషన్ వెరీ ఈజీ..!
పిల్లలకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. వాటిని ఎక్కడ చూసినా కొనిపెట్టాలని మారాం చేస్తుంటారు. అయితే బయట రెస్టారెంట్స్ లో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే ఈ వంటకాన్ని ఇంట్లోనే చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపించరు. ఇంకొంతమందికి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో తెలియదు. మరి సూపర్ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
కరకరలాడే రెస్టారెంట్ స్టైల్ 'ఫ్రెంచ్ ఫ్రైస్' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే బంగాళదుంపలు మూడు పెద్దవి, కార్న్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ లు, ఉప్పు తగినంత, కారం లేదా మిరియాల పొడి చిటికెడు, నూనె వేయించడానికి సరిపడా తీసుకోవాలి. ఇక తయారీ విధానం చూస్తే ముందుగా బంగాళదుంపల తొక్క తీసి ఒకే పరిమాణంలో పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ముక్కలను చల్లని నీటిలో రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు నీరు మరిగించి అందులో కొద్దిగా ఉప్పు వేసి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి.

అలా ఉడికిన ముక్కలను బయటకు తీసి పొడి గుడ్డపై పరిచి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఆరిన ముక్కలను క గిన్నెలోకి తీసుకుని కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మొదట దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నూనె మళ్లీ వేడి చేసి మరో రెండు నిమిషాలు హై ఫ్లేమ్ పై చేసుకోవాలి. ఇక వేడివేడిగా ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్ మీద కొద్దిగా ఉప్పు, కారం లేదా మిరియాల పొడి చల్లుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయినట్టే.. మీరూ ఓసారి ట్రై చేసుకోండి..












Click it and Unblock the Notifications