ఉప ఎన్నికల ఫలితాలు సిద్దూ కథ ఏంటీ, కర్ణాటకలో మోడీ ఎఫెక్ట్ ఉంటుందా !
కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని నంజనగూడు, చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేట శాసన సభ నియోజక వర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గురువారం (ఏప్రిల్ 13)వ తేది వెలువడనున్నాయి.
బెంగళూరు: కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని నంజనగూడు, చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేట శాసన సభ నియోజక వర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గురువారం (ఏప్రిల్ 13)వ తేది వెలువడనున్నాయి.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప భవిష్యత్తు కూడా ఈ ఉప ఎన్నికల ఫలితాలపై ఆదారపడి ఉంది. తీరకలేకుండా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు నంజనగూడు, గుండ్లుపేట ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు.
బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయం మాదే అంటే కాదు మాదే అంటూ ఇన్ని రోజు ధీమా వ్యక్తం చేశారు. కొన్ని గంటల్లో ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అవుతున్న సందర్బంగా ఇరు వర్గాల్లో టెన్షన్ మొదలైయ్యింది.

నంజనగూడులో కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు వి. శ్రీనివాస ప్రసాద్ కర్ణాటక సీఎం సిద్దరామయ్య మీద తిరరుగుబాటు చేసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గుండ్లుపేట శాసన సభ్యుడు దివంగత మంత్రి మహదేవప్రసాద్ ఆకస్మిక మరణంతో అక్కడ ఆయన భార్య గీతా ఉప ఎన్నిక్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు.
వాస్తవానికి ఈ రెండు నియోజక వర్గాలు కాంగ్రెస్ కు కంచుకోట. అయితే రెండు నియోజక వర్గాలు సొంతం చేసుకోవడానికి బీజేపీ శక్తివంచన లేకుండా కృషి చేసింది. మొత్తం మీద నంజనగూడు, గుండ్లు పేటలో ఎవరు విజయం సాధిస్తారో కొన్ని గంట్లో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications