సహనం, సమయం రెండు శక్తిమంతమైన ఆయుధాలు: కమల్-సింధియా ఫోటోలతో రాహుల్ ట్వీట్

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. దీంతో బీఎస్పీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఫలితాలు వచ్చి రెండు రోజులు అయినా ఇంకా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తేల్చలేకపోయింది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల రేసులో ప్రధానంగా ఇద్దరు ఇద్దరు ఉన్నారు. కమల్ నాథ్, జ్యోతిరాధిత్య సింధియా మధ్యప్రదేశ్ నుంచి, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌లు రాజస్థాన్ నుంచి రేసులో ఉన్నారు. రాజస్థాన్‌కు సంబంధించి అశోక్ గెహ్లాట్ పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది.

The two most powerful warriors are patience and time

ఇక, మధ్యప్రదేశ్ పైన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ దృష్టి సారించారు. కమల్, సింధియాల మధ్య పోటాపోటీ నెలకొని ఉంది. ఇద్దరు కూడా సీఎం పదవి కోసం ఎంతో ఆశగా ఉన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. సహనం, సమయం రెండు శక్తిమంతమైన ఆయుధాలంటు లియో టాల్‌స్టాయ్ కొటేషన్‌ను ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+