Lady: భర్త మీద కోపం, పుట్టింటిలో కూతుర్ని, అమ్మమ్మను కొట్టి చంపేసింది !
భార్య గర్బవతి అయిన తరువాత భర్తతో గొడవపడి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కూతురు పుట్టిన తరువాత కూడా భర్త చూడటానికి రాకపోవడంతో భార్య రగిలిపోయింది. భర్త మీద కోపంతో భార్య ఆమె కూతుర్ని, అమ్మమ్మ కొట్టి చంపేసింది. ఈ దాడిలో మహిళ
చెన్నై/పుదుచ్చేరి: దంపంతులు సంతోషంగానే కాపురం చేశారు. భార్య గర్బవతి అయిన తరువాత దంపతుల మద్య గొడవలు అయ్యాయి. గర్బవతి అయిన భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కూతురు పుట్టిన తరువాత కూడా భర్త చూడటానికి రాకపోవడంతో భార్య రగిలిపోయింది. భర్త మీద కోపంతో భార్య ఆమె కూతుర్ని, అమ్మమ్మతో పాటు కుటుంబ సభ్యుల మీద దాడి చెయ్యడం కలకలం రేపింది. మహిళ దాడిలో చిన్నారితో సహ అమ్మమ్మ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

దంపతులు హ్యాపీ
పుదుచ్చేరిలోని కారైకల్ జిల్లా మేలపడుక్కై గ్రామంలో పరమశివం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పరమశివం కుమార్తె దుర్గాలక్ష్మి (36). కారైకల్‌లోని అక్కరైవట్టం గ్రామానికి చెందిన దీనదయాళన్, దుర్గాలక్ష్మి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. దుర్గాలక్ష్మి, దీనదయాళన్ దంపతులు వివాహం జరిగిన తరువాత చాలా సంతోషంగా కాపురం చేశారు.

ఫ్యామిలీలో అందరి మీద దాడి చేసిన మహిళ
కొన్ని నెలల క్రితం భర్త దీనదయాళన్ తో గొడవపడిన దుర్గాలక్ష్మి ఆమె తల్లి ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. రెండు నెలల క్రితం దుర్గాలక్ష్మికి ఆడపిల్ల పుట్టింది. కూతురు పుట్టినా తన భర్త దీనదయాళన్ కనీసం చూడటానికి కూడా రాలేదని దుర్గాలక్ష్మి రగిలిపోయింది. శుక్రవారం వేకువ జామున నిద్రలేచి పలుగు తీసుకుని ఇంట్లో నిద్రిస్తున్న అమ్మమ్మ, తల్లి, సోదరులు, రెండు నెలల పసికందు మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేసింది.

కూతురు, అమ్మమ్మ ప్రాణం పోయింది
తెల్లవారు జామున దుర్గాలక్ష్మి ఇంటి నుంచి అరుపులు విని ఇరుగుపొరుగువారు ఆమె ఇంటికి వెళ్లారు. దుర్గాలక్ష్మి విచక్షణారహితంగా దాడి చేయడంతో గాయపడిన వారిని రక్షించి చికిత్స నిమిత్తం కారైకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రెండు నెలల పసికందు మృతి చెందింది. దుర్గాలక్ష్మి అమ్మమ్మ పట్టి వేదవల్లి (85) కూడా కొన్ని గంటల తరువాత మృతి చెందింది.

భర్త మీద కోపంతో ఇంత చేసిందా ?
విషయం తెలుసుకున్న నేడుంగాడు పోలీసులు దుర్గాలక్ష్మిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుర్గాలక్ష్మి గత నాలుగైదు రోజులుగా మనస్థాపానికి గురైనట్లు సమాచారం. కన్న బిడ్డను, అమ్మమ్మను కొట్టి దారుణంగా హత్య చేసిన దుర్గాలక్ష్మి ఏమాత్రం పక్షాతపం లేకుండా మౌనంగా ఉందని, ఆమెకు చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. పసిబిడ్డను, బామ్మను సొంత ఇంటి మనిషి హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications