UP: యూపీని వణికిస్తోన్న తోడేళ్లు.. కనిపిస్తే కాల్చేయండి.. !

యూపీలోని బహరాయిచ్‌ జిల్లాను తోడేళ్లు వణికిస్తోన్నాయి. తోడేళ్లు మనుషలపై దాడులు చేసి చంపేస్తున్నాయి. ఇప్పటికే 10 మందిని పొట్టన పెట్టుకున్న తోడేళ్లు 30 మందిని గాయపరిచాయి. అధికారులు తోడేళ్లను పట్టుకోవడానికి ఆపరేషన్ భేడియా చేపట్టారు. అయినప్పటికీ తోడేళ్ల దాడులు ఆగడం లేదు. అటవీ శాఖ అధికారులు ఇప్పటి వరకు నాలుగు తోడేళ్లను పట్టుకున్నారు. మరో రెండు తోడేళ్ల కోసం సెర్చ్ కొనసాగిస్తున్నారు. సోమవారం కూడా చిన్నారి దాడి చేసిన తోడేలు తీవ్రంగా గాయపరిచింది.

తోడేళ్లు పిల్లలపై దాడులు చేస్తుండడంతో యూపీ సర్కార్ సీరియస్ అయింది. తోడేళ్లు కనిపిస్తే కాల్చిపడేయాలని ఆదేశాలు జారీ చేసింది. తోడేళ్లను పట్టుకోవడం కష్టం కావడంతో సీఎం యోగిఆదిత్యనాథ్ ఈ ఆదేశాలు చేసినట్లు చెబుతున్నారు. తోడేళ్లను పట్టుకోవడం కుదరని పక్షంలో వాటిని కాల్చేయాలని స్పష్టం చేశారు. అది చివరి అవకాశంగా మాత్రమే పరిగణించాలని చెప్పినట్లు తెలస్తోంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

There are reports that CM Yogi has issued orders to shoot wolves in UP

అయితే సాధారణంగా తోడేళ్లు మనుషులపై దాడులు చేయవని నిపుణులు చెబుతున్నారు. అయితే మనిషి రుచి మరిగిన తోడేళు ఈ దాడులు చేస్తున్నట్లు వారు వాదిస్తున్నారు. తోడేళ్లు గుంపులుగా దాడులు చేసిన ఘటనలు ఎక్కడ లేవన్నారు. ఒక వేళ తోడేళ్లు గుంపుగా దాడి చేస్తే.. మనిషి మృతదేహాన్ని మొత్తం పీక్కుతింటాయని పేర్కొన్నారు. కానీ తోడేళ్ల దాడిలో చనిపోయిన వారి మృతదేహం ఒక చోట మాత్రమే తోడేలు తిన్న అనవాళ్లు కనిపిస్తున్నాయన్నారు.

ఒక తోడేలు మాత్రమే దాడి చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. మృతదేహాంలోని 4 నుంచి 5 కిలోల మాంసమే తింటున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా తోడేళ్లు చిన్న చిన్న జంతువులను వేటాడి తింటాయి. కానీ మనుషులపై మీద దాడి చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+