నిర్మలమ్మ పద్దుతో పెరిగే ధరలు.. తగ్గే ధరల వివరాలు
బడ్జెట్‌లో ఫైనాన్స్ మినిష్టర్ నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. బడ్జెట్ తర్వాత కొన్ని వస్తువుల ధరలు పెరగగా.. మరికొన్నింటివీ తగ్గాయి. వేతన జీవులకు ఊరట కలిగించలేదు. ఐటీ శ్లాబుల్లో మార్పులు ఏమీ చేయలేదు. దీంతో ఉద్యోగులు కాస్త ఆందోళన చెందారు. ఎన్నికల వేళ యూపీకి భారీ ప్యాకేజీ ప్రకటించారు. నదుల అనుసంధానం పేరుతో నిధులను కేటాయించారు.

తగ్గేవీ ఇవే..
బడ్జెట్‌తో విదేశీ యంత్రాలు ధర తగ్గనున్నాయి. వస్త్రాలు, తోలు వస్తువులు ధర కూడా చవక కానుంది. కరోనా వేళ షాపింగ్ తక్కువే జరుగుతున్నా.. ధరలు తగ్గడంతో మరింత తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే వ్యవసాయ పరికరాల ధరలు కూడా దిగివచ్చాయి. మొబైల్ చార్జర్లు కూడా కిందకి దిగాయి. చెప్పులు, బూట్లు ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. వజ్రాల నగలు, ప్యాకేజింగ్ పెట్టెలు, రత్నాల ఆభరణాలు.. ధర కూడా దిగి వస్తోంది.

పెరిగేవి ఇవే..
అలాగే పెరిగే ధరల వివరాలు ఓ సారి చుద్దాం. గొడుగు ధర పెరిగాయి. మూలధన వస్తువులు, ముడి ఇంధనం, రోల్డ్ గోల్డ్ ఆభరణాల ధరలు మరింత పెరిగాయి. వీటిలో రోల్డ్ గోల్డ్ ఒక్కటే.. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కాస్త ఇబ్బంది కలిగించే అంశం. ఎందుకంటే ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే.. అందరూ ఆ నగలనే పెట్టుకుంటారు.

కస్టమ్స్ డ్యూటీ
బడ్జెట్‌లో ప్రభుత్వం రత్నాలు, ఆభరణాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించింది. కస్టమ్ డ్యూటీని 5 శాతం తగ్గించి, కట్, పాలిష్ చేసిన వజ్రాలపై కూడా కస్టమ్ డ్యూటీని ప్రభుత్వం 5 శాతం తగ్గించింది. దీంతో వాటి ధరలు బాగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.
Recommended Video

ఆశలు అడియాసలు
కరోనా సమయంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పై సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టాక్స్ రిటర్న్స్ అప్డేట్ చేసుకోవడానికి రెండేళ్ల సమయం పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఇదే సమయంలో దేశ అభివృద్ధి పై, దేశ ఆర్థిక రంగానికి ఊతమిచ్చే విషయాలపై దృష్టి సారించిన బడ్జెట్లో, వచ్చే మూడేళ్లలో భారత్ 400 కొత్త, ఇంధన-సమర్థవంతమైన వందే భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తన బడ్జెట్‌లో ప్రకటించారు. దేశంలో రైల్వే రంగాన్ని కొత్త పుంతలు తొక్కించటంలో భాగంగా నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications