వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క ఓటు.. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇది తమిళనాడుకే సాధ్యం : ఎద్దేవా చేసిన స్టాలిన్

ఒక్క ఓటుకు ముగ్గురు ముఖ్యమంత్రులు పదవీ బాధ్యతలు స్వీకరించడం ఒక్క తమిళనాడులో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా జరగదని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఎద్దేవా చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఒక్క ఓటుకు ముగ్గురు ముఖ్యమంత్రులు పదవీ బాధ్యతలు స్వీకరించడం ఒక్క తమిళనాడులో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా జరగదని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఎద్దేవా చేశారు.

తిరుచ్చిలో సోమవారం ఓ వివాహంలో పాల్లొన్న ఆయన.. పెళ్లిలో రాజకీయాలు మాట్లాడకూడదంటూనే.. ఓ పిట్ట కథ చెప్పారు. ''ఒక ఊరిలో ఓ ఏరు ఉండేది. పక్కనే ఉన్న గ్రామస్థులు రోజూ ఆ ఏటిని పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టు ద్వారా దాటేవారు. ఓ అయిదారేళ్ల తరువాత ఆ ప్రాంతమంతా ఎడారిలా మారింది. దీంతో ప్రజలు ఆ ఏటిలో దిగి నడుచుకుంటూ అవతలి గట్టుకు చేరుకునేవారు.

Three Chief Ministers for Single Vote : Stalin Setire

కానీ ఉన్నట్లుండి.. ఆ ఏట్లోకి భారీ స్థాయిలో నీళ్లు వచ్చి చేరాయి. ఫలితంగా ఆ మహా వృక్షం కూడా మునిగిపోయింది. దీంతో అవతలి ఒడ్డుకు ఎలా చేరుకోవాలో తెలియక గ్రామస్థులు ఆలోచనలో పడ్డారు.

ఏటి గట్టునే ఓ దుంగ కనిపించడంతో.. దాని సాయంతో ఏరు దాటవచ్చనుకుని కొందరు దానిపైకెక్కారు. సగం దూరం ప్రయాణించాక తెలిసింది.. అది దుంగ కాదు, మొసలి అని! దీంతో వారు తమను కాపాడమని కేకలు పెట్టారు.

గట్టుపైనున్న మరి కొందరు ''మిమ్మల్ని కాపాడేందుకు ఓ పడవ తీసుకొస్తాం. అప్పటి వరకు మీరు ప్రాణాలతో ఉండండి..'' అని వారికి సలహా ఇచ్చారు. ఇదీ కథ.. అంటూ ప్రస్తుత తమిళనాడు రాజకీయాలకు ఈ కథను అన్వయించి చెప్పిన స్టాలిన్.. ముక్తాయింపుగా.. ''నన్ను సమస్యలోకి నెట్టకండి..'' అంటూ తప్పించుకున్నారు.

English summary
People of Tamil Nadu did not vote for anyone from Jayalalithaa’s “household” to be chief minister, says DMK Working President M K Stalin, who appears to be keeping his options open on the possibility of another government in the tenure of the current Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X