అజిత్ దోవల్ నివాసం వద్ద భద్రతా వైఫల్యం: ముగ్గురు సీఐఎస్ఎఫ్ కమాండోలు డిస్మిస్

న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ నివాసం వద్ద భద్రతా వైఫల్యంపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. భద్రతగా ఉన్న ముగ్గురు సీఐఎస్ఎఫ్ కమాండోలను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. అంతేగాక, మరో ఇద్దరు సీనియర్ అధికారులను బదిలీ చేశారు.

కాగా, అజిత్ దోవల్‌కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కొనసాగుతోంది. సీఐఎస్ఎఫ్‌కు చెందిన ఎస్ఎస్‌జీ సెంట్రల్ వీఐపీ భద్రత కల్పిస్తోంది.

 Three CISF commandos dismissed from service over security breach at NSA Ajit Dovals residence.

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) ఏర్పాటు చేసిన కోర్టు ఆఫ్ ఎంక్వైరీ ఆదేశాల మేరకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న అజిత్ దోవల్ నివాసం వద్ద భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. కాగా, ముగ్గురు ఎస్ఎస్‌జీ కమాండోలను సర్వీస్ నుంచి తొలగించగా.. మరో ఇద్దరు సీనియర్ అధికారులను బదిలీ చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఉదయం 7.30 గంటలకు సెంట్రల్ ఢిల్లీలోని భారీ భద్రతతో ఉన్న అజిత్ దోవల్ నివాసంలోకి దూసుకెళ్లేందుకు కారుతో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వహించారనే కారణంతో వారిపై చర్యలు తీసుకున్నారు. కాగా, దోవల్ ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన పట్టుకున్న భద్రతా సిబ్బంది.. ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+