ఎన్‌కౌంటర్: ముగ్గురు మావోయిస్టులు మృతి, వీరిలో ఇద్దరు మహిళలు
గడ్చిరోలి: మహారాష్ట్రలోని దక్షిణ గడ్చిరోలి ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మంగళవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్లో మృతి చెందిన ముగ్గురిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారని పోలీసులు తెలిపారు.
మృతులను సౌత్ గడ్చిరోలి డివిజనల్ కమిటీ సభ్యుడు సునీల్ కుల్మెథె(40), అతని భార్య స్వరూప(38)గా గుర్తించారు. మృతి చెందిన మరో మహిళను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

కాగా, ఇటీవల ఇద్దరు మహిళలు సహా మొత్తం ఐదుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇది జరిగిన ఐదు రోజులకే తాజా ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications