లాలూ ప్రసాద్ దాణా కేసు: 17 ఏళ్లుగా ఇలా..

రాంఛీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రాలతోపాటు మరో 45మందిని సిబిఐ కోర్టు సోమవారం దోషులుగా తేల్చింది. ఈ కుంభ కోణం మూలంగా లాలూ ప్రసాద్ యాదవ్ తన ముఖ్యమంత్రి పదవిని కూడా కోల్పోయారు. కుంభ కోణం జరిగిన నాటి నుంచి దోషులుగా తేలిన నేటి వరకు వివరాలు..

జనవరి 27, 1996: దాణా కుంభకోణం వెలుగు చూసింది. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దాణా పంపిణీ పేరిట మనుగడలో లేని కంపెనీలకు తరలించడం జరిగింది. అయితే పశువుల దాణాను ఒక స్కూటరుపై తరలించినట్లు ఓ కాగితం మీద చూపించారు.

Lalu Prasad Yadav

మార్చి 11, 1996: దాణా కుంభ కోణంపై విచారించాలని సిబిఐకి పాట్నా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మార్చి 19, 1996: హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టు సమర్థించింది. విచారణను పర్యవేక్షించేందుకు ఒక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

జులై 27, 1997: సిబిఐ విచారణ, నేరారోపణల నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీ దేవిని బీహార్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు.

జులై 30, 1997: సిబిఐ కోర్టులో లాలూ ప్రసాద్ యాదవ్ లొంగిపోయారు.

ఆగస్టు 19, 1998: లాలూ ప్రసాద్, రబ్రీ దేవీలపై అదనపు ఆస్తుల కేసు నమోదు.

ఏప్రిల్ 4, 2000: డిఏ కేసు ఛార్జీషీటులో ప్రధాన నిందితునిగా లాలూ ప్రసాద్, నిందితురాలిగా రబ్రీ దేవిని ప్రస్తావించడం జరిగింది.

ఏప్రిల్ 5, 2000: లాలూ ప్రసాద్, రబ్రీ దేవీలు లొంగిపోయారు. కాగా బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న రబ్రీ దేవికి బెయిల్ లభించింది.

జూన్ 9, 2000: లాలూ ప్రసాద్‌పై కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేయడం జరిగింది.

అక్టోబర్ 2001: నూతన రాష్ట్రంగా జార్ఖండ్ ఏర్పడిన కారణంగా లాలూ కేసులన్నీ ఆ రాష్ట్రానికి బదిలీ చేస్తూ తర్వాతి నెలలో రాంఛీలో లొంగిపోవాలని లాలూను ఆదేశించారు.

డిసెంబర్ 18, 2006: లాలూ ప్రసాద్, రబ్రీ దేవీలకు డిఏ కేసులో క్లీన్ చిట్ లభించింది.

2000-2012: జార్ఖండ్ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కేసుకు సంబంధించిన కొందరు కీలక సాక్షులు మరణించారు.

మే 17, 2013: సిబిఐ ప్రత్యేక కోర్టుకు లాలూపై మరో దాణా కుంభకోణం ఆరోపణలు. ఈ కేసులో మోసపూరితంగా దుమ్కా ట్రెజరీ నుంచి రూ.3.13 కోట్లను డిసెంబర్ 1995 నుంచి జనవరి 1996 మధ్యలో విత్ డ్రా చేసినట్లు ఆరోపణలున్నాయి.

సెప్టెంబర్ 17, 2013: దాణా కుంభకోణం కేసులో రాంఛీ ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.

సెప్టెంబర్ 30, 2013: బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రాలతోపాటు 45మందిని దాణా కుంభకోణంలో నిందితులుగా పేర్కొంటూ న్యాయమూర్తి ప్రవాస్‌కుమార్ సింగ్ తీర్పును వెలువరించారు. నిందితులకు అక్టోబర్ 3న శిక్షను ఖరారు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+