స్టాలిన్, 21 మంది ఎమ్మెల్యేలకు కాస్త ఊరట: అంత వరకు వద్దని చెప్పిన హై కోర్టు, గుట్కా కేసు !
తమిళనాడు శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ కు కాస్త ఊరట లభించింది.
చెన్నై: తమిళనాడు శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ కు కాస్త ఊరట లభించింది. తమిళనాడు శాసన సభ స్పీకర్ ఎంకే. స్టాలిన్ తో పాటు డీఎంకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేల మీద వేటు వెయ్యకుండా మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
శాసన సభలోకి గుట్కా ప్యాకెట్లు తీసుకు వచ్చారని, నియమాలు ఉల్లంఘించిన మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని తమిళనాడు శాసన సభ క్రమశిక్షణా కమిటీ ఎంకే. స్టాలిన్ తో సహ డీఎంకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అప్పట్లో ఎంకే. స్టాలిన్ ఆరోపించారు.

తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన అన్నాడీఎంకే పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తూ తమిళనాడు స్పీకర్ ధనపాల్ చర్యలు తీసుకున్నారు. ఇక డీఎంకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గుతుందని జోరుగా ప్రచారం జరిగింది.
తమ మీద ఎక్కడ సస్పెన్షన్ వేటు పడుతుందో అంటూ అందోళనతో డీఎంకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం డీఎంకే పార్టీ ఎమ్మెల్యేల పిటిషన్ విచారణ చేసిన మద్రాసు హైకోర్టు అక్టోబర్ 27వ తేదీకి విచారణ వాయిదా వేసింది.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్












Click it and Unblock the Notifications