సోనియాకు సమాచారం: రోశయ్య రాజీనామా యోచన?

చెన్నై: తమిళనాడు గవర్నర్ పదవి నుంచి తప్పుకోవడానికి కె. రోశయ్య సిద్దపడినట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాచారం చేరవేసినట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదే బాటలో కర్ణాటక గవర్నర్ హెచ్.ఆర్ భరద్వాజ్‌ కూడా రాజీనామాకు సిద్ధపడినట్టు వార్తలు వస్తున్నాయి.

కాగా, గురువారం ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శఖర్ దత్ రాజీనామా చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజీనామా చేసిన రెండో గవర్నర్ ఈయన. ఈయన కంటే ముందు ఉత్తరప్రదేశ్ గవర్నర్ భన్వరీలాల్ జోషీ రాజీనామా చేశారు.

TN governor Rosaiah in a bid to resign

ఈ నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ కె రోశయ్య, కర్ణాటక గవర్నర్ హెచ్.ఆర్ భరద్వాజ్‌లు రాజీనామా చేసేందుకు సిద్ధపడి, ఈ విషయాన్ని పార్టీ అధినేత్రికి చేరవేసినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. అయితే, కేరళ గవర్నర్ షీలా దీక్షిత్, గోవా గవర్నర్ బీఆర్ వాంకోలు తమ పదవుల నుంచి తప్పుకునేందుకు ఇష్టపడండ లేదు. దీంతో వారికి కేంద్రం వారికి పరోక్షంగా మందలించినట్టు సమాచారం.

అదేవిధంగా నాగాలాండ్ గవర్నర్ డాక్టర్ అశ్విని కుమార్‌, గుజరాత్ గవర్నర్ కమలా బేణీవాల్‌లను కూడా కేంద్రం రాజీనామా కోరింది. గుజరాత్ గవర్నర్ రేసులో బిజెపి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఉన్నారు. గతంలో యుపిఎ అధికారంలోకి వచ్చిన వెంటనే హర్యానా, ఉత్తరప్రదేశ్, గోవా, గుజరాత్ గవర్నర్‌లను మార్చివేసిన విషయం తెలిసిందే. అదే బాటలో ప్రస్తుతం ఎన్డిఎ ప్రభుత్వం నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+