శశికళకు షాక్: పళని, పన్నీర్ స్కెచ్: దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ, వేటు ?

శశికళ వర్గానికి షాక్ ఇచ్చిన తమిళనాడు స్పీకర్ దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యేలకు రెండో సారి నోటీసులు సమాధానం ఇవ్వకుంటే వేటు గ్యారెంటీ ?

చెన్నై: తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి రిసార్ట్ రాజకీయం చేస్తున్న దినకరన్ గ్రూప్ లోని అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. రెబల్ ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వకుంటే అనర్హత వేటు పడే అవకాశం ఉందని తెలిసింది.

అన్నాడీఎంకే పార్టీ నియమాలు ఉల్లంఘించి ప్రభుత్వం మీద తిరుగుబాటు ఎందుకు చేశారు అని సమాధానం చెప్పాలని స్పీకర్ ధనపాల్ రెబల్ ఎమ్మెల్యేలకు తాజాగా రెండో సారి నోటీసులు జారీ చేశారు. టీటీవీ దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేల మీద కఠిన చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే పార్టీ చీఫ్ విప్ రాజేంద్రన్ స్పీకర్ ధనపాల్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

TN Speaker Danapal once again has sent notice Dinakaran faction MLAs

ఆ సమయంలో గత సోమవారం స్పీకర్ ధనపాల్ అన్నాడీఎంకే పార్టీలోని 19 మంది రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ ధనపాల్ జారీ చేసిన నోటీసులకు తాము సమాధానం ఇవ్వమని, అంత అవసరం మాకు లేదని టీటీవీ దినకరన్ గ్రూప్ లోని సీనియర్ ఎమ్మెల్యే వెట్రివేల్ మీడియాకు చెప్పారు.

రెబల్ ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మరో సారి తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ నోటీసులు జారీ చేశారు. దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యేలు ఏం సమాధానం ఇస్తారో అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+