మనిషి రక్తం మరిగిన తోడేలు సైతం.. ఆ తల్లి సాహసానికి తోక ముడిచింది!
కన్నబిడ్డకు హాని జరుగుతుందంటే ఏ తల్ల అయినా ఊరుకోదు. బిడ్డ ప్రాణాలకు తన ప్రాణాన్ని అడ్డుగా వేసి కాపాడుకుంటుంది. అలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో చోటుచేసుకుంది. బిడ్డను కాపాడుకునేందుకు మనిషి రక్తం మరిగిన తోడేలుతో పోరాడింది. తల్లి ప్రేమకు విలువ కట్టలేరని ప్రపంచానికి చాటిచెప్పింది. ఆ తల్లి వీరోచిన పోరాటానికి క్రూర మృగం సైతం తోక ముడిచి పరుగు లంకించింది.
ఇటీవల కాలంలో ఉత్తర ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ తోడేళ్ల గుంపు చేస్తోన్న దాడులతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. హర్ది ప్రాంతంలో జరిగిన ఓ ఘటన తాజాగా వెలుగు చూసింది. ఓ తల్లి తన ఐదేళ్ల బిడ్డ పరాస్‌ను పక్కన పెట్టుకుని నిద్రలోకి జారుకుంది. వేకవ సమయంలో ఏదో అలికిడి వినబడి లేచేసరికి ఆమెకు తన బిడ్డ కనిపించలేదు. పరుగున బయటకు వచ్చి చూడగా తన బిడ్డ మెడ పట్టుకుని ఓ తోడేలు ఈడ్చుకెళ్లడం కనిపించింది. కొడుకును ఆ భయానక స్థితిలో చూసిన ఆ తల్లి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.

తోడేలు గొంతును ఊపిరి ఆడకుండా
మనిషి రక్తానికి అలవాటు పడ్డ తోడేలుపైకి బిడ్డ రక్తాన్ని చూసిన ఆ బాధతో ఒక్కసారిగా దూకింది. తన రెండు చేతులతో తోడేలు గొంతును ఊపిరి ఆడకుండా బిగించింది. ఆ తల్లి పోరాటానికి తోడేలు తోకముడిచింది. చిన్నారిని వదిలి పెట్టి, పరుగు లంకించింది. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు తోడేలు దాడిలో గాయపడిన చిన్నారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉందని, ఎలాంటి ప్రాణపాయం లేదుని వైద్యులు తెలిపారు. బిడ్డ ప్రాణం కోసం ఆ తల్లి చూపిన ధైర్య సాహసాలను అందరూ అభినందిస్తున్నారు.
ఆపరేషన్ భేడియాలో భాగంగా..
బహ్రాయిచ్ ప్రాంతంలో ఇప్పటి వరకు ఈ తోడేళ్ల గుంపు చేసిన దాడిలో తొమ్మిది మంది మృతి చెందారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంంతో యూపీ ప్రభుత్వం ఆపరేషన్ భేడియాలో భాగంగా విన్నూత ప్రయత్నం చేస్తోంది. చిన్నారుల మూత్రంతో తడిపిన రంగురంగుల టెడ్డీ బొమ్మలను ఎరగా వేసి, తోడేళ్ల గుంపును పట్టుకునేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఈ బొమ్మలను నది ఒడ్డున, తోడేళ్లు విశ్రాంతి తీసుకునే గుహలకు దగ్గరగా ఉంచుతున్నారు. అలా మనుషుల వాసనను తోడేళ్లకు ఎరగా వేసి, వాటిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications