మొబైల్ నంబర్లకు ఫీజు: క్లారిటీ ఇచ్చిన ట్రాయ్

TRAI: మొబైల్‌, ల్యాండ్‌ లైన్‌ నంబర్లకు ఫీజు వసూలు చేసేలా టెలికం రెగ్యులేటరీ చర్యలు తీసుకోబోతోందంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తోన్నాయి. ఫోన్‌ నంబర్లను విలువైన వనరుగా భావిస్తోన్న ట్రాయ్..వాటి వినియోగంపై ఛార్జీలు విధిస్తుందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఒకట్రెండు రోజుల్లో ఆమోదిస్తుందంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది.

తొలుత సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయాలని ట్రాయ్‌ భావించిందని, ఆ తరువాత వాటిని వినియోగదారుల నుంచి వసూలు చేసుకొనే అవకాశం ఆపరేటర్లకు కల్పించేలా ప్రతిపాదనలను రూపొందించిందని, దీని అమలుపై అభిప్రాయ సేకరణ నిర్వహించిందంటూ లీకులు వెలువడ్డాయి.

TRAI intends to impose charges on customers for holding multiple SIMs is false

ఈ ఛార్జీలు ఎలా వసూలు చేస్తారు?, సిమ్ కార్డ్ కొనుగోలు సమయంలోనే వినియోగదారుల నుంచి కొంత మొత్తాన్ని తీసుకుంటారా? లేక సంవత్సరానికి నిర్దేశిత మొత్తాన్ని ఫీజుల రూపంలో వసూలు చేస్తారా అనేది తెలియ రావాల్సి ఉందనే ప్రచారం జరిగింది. జాతీయ మీడియాలో విస్తృతంగా దీనిపై కథనాలు వెలువడ్డాయి.

గత సంవత్సరం డిసెంబర్‌లో అమలులోకి వచ్చిన టెలికాం కొత్త చట్టం ప్రకారం ఫోన్‌ నంబర్లకు ఛార్జీలు వసూలు చేసుకొనే అవకాశం కలిగిందని, దీని ఆధారంగా స్పెక్ట్రమ్ తరహాలో ఫోన్‌, ల్యాండ్‌లైన్‌ నంబర్లకు సంబంధించి యాజమాన్య హక్కులు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండటం వల్ల.. వాటి వినియోగానికి సంబంధించినంత వరకు ఛార్జీలను వసూలు చేయడం, ఎక్కువ కాలం పాటు రీఛార్జీ చేయని నంబర్లను రద్దు చేయని సంస్థలపై జరిమానా విధించాలని ట్రాయ్‌ ప్రతిపాదించినట్లు తెలిసింది.

ఈ వార్తలపై ఎట్టకేలకు ట్రాయ్ స్పందించింది. ఈ వార్తలన్నీ నిరాధారమని తేల్చి చెప్పింది. అలాంటి ప్రతిపాదనలేవీ తమ వద్ద లేవని వివరించింది. ఆ వార్తలన్నీ ఊహాజనితమైనవిగా అభివర్ణించింది. ఒకటి కంటే ఎక్కువ సిమ్‌/నంబరింగ్‌ను కలిగి ఉన్నందుకు వినియోగదారులపై ఛార్జీలు విధించాలని ట్రాయ్ భావిస్తోన్నట్లు వచ్చిన వార్తలను నమ్మవద్దని కోరింది. అవన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలు ప్రజలను తప్పు దోవ పట్టిస్తాయని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+