లోకో పైలెట్ దీన్ని గమనించకపోతే ప్రమాదమే
తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే విషయానికొస్తే మనదేశంలో రైల్వేను మించింది లేదు. ఛార్జీలు కిలోమీటరుకు కొన్ని పైసలు మాత్రమే అవుతాయి. ఒక రూపాయి ఖర్చుపెడితే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని అర్థమవుతోంది. ప్రయాణం చేసే సమయంలో మనకు ఎన్నో విషయాలు నేర్చుకోవాలనిపిస్తుంది. అలాగే కొన్ని అవసరం లేనివి కూడా ఉంటాయి. రైలు లోకో పైలెట్ కు సంబంధించిన ఒక విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రైల్వే స్టేషన్ లో ప్లాట్‌ఫారమ్‌పై పసుపు రంగు బోర్డును చూసివుంటాము. పచ్చరంగుపై నలుపు రంగుతో అక్షరాలు రాసివుంటాయి. రెండువైపులా స్టేషన్ పేరు కూడా రాసివుంటుంది. అక్కడి స్థానిక భాషతోపాటు హిందీ, ఇంగ్లిషు, ఉర్ధూలో ఆ స్టేషన్ పేరు రాసివుంటుంది. బోర్డు దిగువన, సముద్ర మట్టం నుంచి ఆ స్టేషన్ ఎత్తు ఎంత అనే విషయం కూడా రాసి ఉంటుంది. లోకో పైలెట్ కు ఇది చాలా ముఖ్యం. సముద్ర మట్టం ఎత్తు నుండే లోకో పైలట్‌కు ట్రాక్ పైకి ఉందా లేదంటే కిందకు వెళుతుందా? అనే అవగాహనకు వస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పైలెట్ ఇంజన్ విద్యుత్ సరఫరాను, వేగాన్ని నిర్ణయిస్తారు. తద్వారా రైలు సులభంగా గమ్యస్థానానికి చేరుకుంటుంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వేలు మారుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతోపాటు వారిని వారి గమ్యస్థానాలకు అతి తొందరగా చేర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆకాంక్షలకు అనుగుణంగా వందే భారత్ రైళ్లు తయారవుతున్నాయి. ఎక్కువ దూరాన్ని సాధ్యమైనంత త్వరగా తక్కువ గంటల్లో ప్రధాన నగరాలకు చేరుకునేలా వీటిని నడుపుతున్నారు. సెమీ హైస్పీడ్ రైళ్లుగా ఇవి పట్టాలెక్కుతున్నాయి. ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ చూరగొంటున్నాయి.












Click it and Unblock the Notifications