తన డిమాండ్ ను పట్టించకోలేదని, దండం తీసుకొని పరుగెత్తాడు,టిఎంసి ఎంఏల్ఏ తీరుపై స్పీకర్ అసహనం

తన డిమాండ్ ను పట్టించుకోకపోవడంతో స్పీకర్ టేబుల్ పై ఉన్న దండాన్ని తీసుకొని బయటకు పరుగెత్తాడు టిఎంసి ఎంఏల్ఏ బర్మాన్. ఈ ఘటనతో స్పీకర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. అటవీశాఖ మంత్రి పై వచ్చిన లైంగిక ఆరోపణ

అగర్తల :తన డిమాండ్ ను పట్టించుకోకపోవడంతో స్పీకర్ టేబుల్ పై ఉన్న దండాన్ని తీసుకొని ఓ ఎంఏల్ఏ పరుగెత్తాడు. ఆయనను అడ్డుకొనేందుకు పలువురు ఎంఏల్ఏలు ప్రయత్నించారు. చివరకు మార్షల్స్ ఆయన వద్ద ఉన్న దండాన్ని తీసుకొని స్పీకర్ టేబుల్ పై ఉంచారు. ఈ ఘటన త్రిపుర అసెంబ్లీలో చోటుచేసుకొంది.

అధికారపక్షంపై తీవ్ర ఆరోపణలు చేసిన విపక్ష పార్టీకి చెందిన టిఎంసి ఎంఏల్ఏ డిమాండ్ ను స్పీకర్ పట్టించుకోలేదు. దీంతో అసహనానికి గురైన టిఎంసి ఎంఏల్ఏ స్పీకర్ టేబుల్ పై ఉన్న దండాన్ని తీసుకొని పారిపోయాడు.

ఇలాంటి ఘటన మొదటిసారి కాదు

త్రిపుర అటవీశాఖ, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి నరేజ్ జమాతీయ లైంగికదాడికి పాల్పడ్డారనే ఆరోఫణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై అసెంబ్లీలో చర్చ కోసం విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ విషయమై టిఎంసి, కాంగ్రెస్ పార్టీలు అటవీశాఖ మంత్రిని మంత్రి వర్గం నుండి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.

 Trinamool Congress MLA walks off with Tripura speaker's mace

ఈ విషయమై అసెంబ్లీలో చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. అందుకు స్పీకర్ నిరాకరించారు. దీంతో ఆగ్రహానికి గురైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ఏ సుదీప్ రాయ్ బర్మాన్ స్పీకర్ టేబుల్ పై ఉన్న అధికార దండాన్ని తీసుకొని పరుగెత్తాడు. అయితే ఆయనను తోటి ఎంఏల్ఏలు ప్రయత్నించారు.

అసెంబ్లీ తలుపులు తీసుకొని ఆయన బయటకు వెళ్ళారు. మార్షల్స్ ఆయన వద్ద ఉన్న అధికార దండాన్ని తీసుకొని తిరిగి స్పీకర్ టేబుల్ పై ఉంచారు. టిఎంసి ఎంఏల్ఏ వ్యవహరించిన తీరు పట్ల స్పీకర్ చంద్రదేబ్ నాథ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా సిగ్గుగా భావిస్తున్నానని చెప్పారు. సీనియర్ ఎంఏల్ఏగా ఉండి కూడ ఈ రకంగా వ్యవహరించిన బర్మాన్ జూనియర్లకు ఏ రకమైన సందేశాన్ని ఇవ్వదలుచుకొన్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+