టీటీవీ దినకరన్ కొత్త పార్టీ, రాత్రికి రాత్రి పార్టీ పదవులు, మాజీ మంత్రులు, 15 ఎమ్మెల్యేలతో !
అన్నాడీఎంకే పార్టీ ఇప్పుడు మూడు ముక్కలు అయ్యింది. శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ ఇప్పుడు కొత్త వర్గానికి నాయకత్వం వహిస్తున్నాడు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఇప్పుడు మూడు ముక్కలు అయ్యింది. శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ ఇప్పుడు కొత్త వర్గానికి నాయకత్వం వహిస్తున్నాడు. అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి టీటీవీ దినకరన్ ను బహిష్కరించిన విషయం తెలిసిందే.
టీటీవీ దినకరన్ శుక్రవారం రాత్రి తన కొత్త పార్టీకి నామకరణం చేశాడు. అన్నాడీఎంకే పురట్చి తలైవీ అమ్మ పేరవై పార్టీ పేరుతో కొత్త అవతారం ఎత్తాడు. అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) వర్గంలో ప్రస్తుతం ఉన్న నాయకులను వారి పదవుల నుంచి తొలగించకుండా టీటీవీ దినకరన్ 64 మంది తన అనుచరులకు కీలక పదవులు కట్టబెట్టాడు.

అన్నాడీఎంకేలోని 18 విభాగాలకు కార్యదర్శలును నియమించారు. అందులో 15 మంది ఎమ్మెల్యేలు ఉండటం విశేషం. మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు తోపు వెంకటాచలం, సెంథిల్ బాలాజీ, పళనియప్పన్ తదితరులకు పార్టీ పదవులు కట్టబెట్టారు.
ఆగస్టు 14వ తేదీ నుంచి టీటీవీ దినకరన్ తమిళనాడు రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రచార విభాగం ఉప కార్యదర్శులుగా నాంజిల్ సంపత్, ఇళవరసిలను నియమించారు. నలుగురు మహిళా శాసన సభ్యులు అయిన సత్య పన్నీర్ సెల్వం, ఉమామహేశ్వరీ, చంద్రప్రభ, జయంతి పద్మనాభంలకు పదవులు కట్టబెట్టిన టీటీవీ దినకరన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి ఝలక్ ఇచ్చాడు.












Click it and Unblock the Notifications