coronavirus: కరోనాకు మందు కనిపెట్టడంలో బిజీ, ప్రైవేట్ ల్యాబ్‌లకు బాధ్యత..?
కరోనా వైరస్ విస్తరించడంతో ప్రభుత్వ దవాఖానాలు, ల్యాబ్‌లతోపాటు ప్రేవైట్ ల్యాబ్‌ల్లో పరీక్షలు చేసేందుకు భారతీయ వైద్య పరిశోధన సంస్థ అనుమతిచ్చింది. ఇప్పుడు దేశీయంగా వైరస్‌కు కనుగొనే ముందును టెస్ట్ చేసేందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. దీంతో వైరస్‌కు వ్యాక్సిన్ ప్రక్రియ మరింత వేగంగా కానుంది.

ప్రైవేట్ ల్యాబ్‌ల్లో పరీక్షించే కిట్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ కానీ, యూరొపియన్ సీఈ కానీ ఆమోదం ఇవ్వలేదని నొక్కి వక్కానించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆమోదం మేరకు వారు పరీక్షలు చేస్తున్నారని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం పేర్కొన్నారు. అంతకుముందు మాత్రం ప్రభుత్వం కిట్లకు యూఎస్ ఎఫ్‌డీఏ లేదంటే, యూరొపియన్ సీఈ ఆమోదం తప్పనిసరి అని పేర్కొన్న సంగతి తెలిసిందే.
కరోనా వైరస్‌కు సంబంధించి నమూనాలను సేకరించి పరీక్షించేందుకు అమెరికా బృందం సేకరించి..ఇండియాకు పంపిస్తోందని తెలిపింది. అవి దేశంలోని ప్రయోగశాలలకు పంపిణీ చేస్తున్నామని ఐసీఎంఆర్ పేర్కొన్నది. ఐసీఎంఆర్ తొమ్మిది కిట్లను మూల్యంకనం చేసింది. ఇందులో రెండు అట్లాంటా డయాగ్నొస్టిక్స్‌కు చెందినది కాగా, రెండోది మై ల్యాబ్‌కి చెందినది. ప్రైవేట్ ల్యాబుల కోసం వివరణలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేస్తామని ఐసీఎంఆర్ పేర్కొన్నది. 12 ల్యాబుల ద్వారా 15 వేల శాంపిల్ కలెక్షన్ చేయబోతున్నారని పేర్కొన్నది. ఐసీఎంఆర్ కింద 111 ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని.. రోజుకు 10 వేల శాంపిల్స్ సేకరిస్తున్నామని డాక్టర్ భార్గవ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications