Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒకే ఫ్యామిలీలో ఐదు మంది హత్య, వాటర్ మిక్సింగ్ లో ఏం కలిపారంటే, తెలంగాణ మూలికతో ?

ముంబాయి/హైదరాబాద్: మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని మహాగావ్ గ్రామంలో 20 రోజుల్లోనే ఒకే కుటుంబానికి (same family) చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించిన షాకింగ్ న్యూస్ ఇది. ఒకే కుటుంబానికి చెందిన వారు కొద్దిరోజుల వ్యవదిలో ఎలా మృతి చెందారనేది తెలీక ఆ ప్రాంతంలోని ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేయడంతోపాటు పలు అనుమానాలకు తావిచ్చింది.

అయితే అంతకంటే షాకింగ్ విషయం ఇప్పుడు వెలుగులోకి రావడంతో స్థానికులు, బందువులు హడలిపోయారు. ఐదు మంది (same family) అనుమానాస్పదంగా చనిపోయిన కేసులో మిస్టరీ వీడింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు (lady) ఐదు మందికి విషమిచ్చి హత్య చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. ఐదు మంది హత్య కేసులో సంఘమిత్ర, ఆమె బంధువు రోసా రామతేకే అలియాస్ రోసా అనే ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు.

Two women of the same family killed five people in the same family by mixing poison in water and food

నిందితుల్లో ఒకరైన సంఘమిత్ర రోషన్ కుంభారే అనే వ్యక్తిని ప్రేమించి లవ్ మ్యారేజ్ (marriage) చేసుకుంది. తరువాత రోషన్ తల్లి విజయా (aunty) కుంభారేతో రోషన్ భార్య సంఘమిత్రకు విబేధాలు వచ్చాయి. భర్త రోషన్, అత్త విజయాలు నిత్యం తనను టార్చర్ పెడుతున్నారని సంఘమిత్ర రగిలిపోయింది. విజయా భర్త శంకర్ కంబార చూసిచూడనట్లు వ్యవహరించాడని తెలిసింది. శంకర్ కంబార, విజయా దంతపులకు సమీప బంధువు రోసా అని పోలీసులు అంటున్నారు.

నిందితురాలు రోసా ఆస్తి వివాదం కారణంగా శంకర్ కుంభరే కుటుంబంమీద పగ పెంచుకుంది. అలా శంకర్ కంభార కుటుంబం తీరుతో సంఘమిత్ర, రోసా ఇబ్బందులు పడ్డారని, తరువాత ఇదే విషయంలో సంఘమిత్ర, రోసా ఒకరి బాధలు ఒకరు చెప్పుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. భర్త (husband) రోషన్ తో పాటు అత్త విజయాను చంపేయాలని సంఘమిత్ర ప్లాన్ చేసింది.

తరువాత హత్యలు చెయ్యడానికి నేను నీకు సహకరిస్తానని, నా పగకూడా తీరినట్లు ఉంటుందని రోసా విజయా కోడలు (daughter in law)సంఘమిత్రాతో చేతులు కలిపింది. సంఘమిత్ర, రోసా ఇద్దరూ కలిసి రోషన్ కుటుంబ సభ్యుల హత్యకు (muder) పథకంపన్నారు. నీళ్లలో, ఆహారంలో విషం కలిపి ఎవరికీ అనుమానం రాకుండా ఐదుగురు కుటుంబ సభ్యులకు ఇచ్చి వారిని చంపేశారు. ఆహారం నాసిరకంగా ఉండడంతో కుటుంబంలోని (family) ఐదు మంది కొన్ని రోజుల వ్యవదిలో చనిపోయి ఉంటారని కథనం సృష్టించిన సంఘమిత్ర, రోసా సైలెంట్ గా ఉండిపోయారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Two women of the same family killed five people in the same family by mixing poison in water and food

సెప్టెంబర్ 20న మహాగావ్ గ్రామానికి చెందిన శంకర కుంభరే (సంఘమిత్ర మామ), శంకర్ భార్య విజయా కుంభరే (సంఘమిత్ర అత్త) అనారోగ్యానికి గురయ్యారు. వారి పరిస్థితి విషమంగా మారడంతో సెప్టెంబర్ 26వ తేదీన శంకర్, మరుసటి రోజు విజయా చనిపోయారు.శంకర్ కుమారుడు (son) రోషన్ (సంఘమిత్రా భర్త), శంకర్ కుమార్తెలు కోమల దహ్గోకర్, ఆనంది (సంఘమిత్రా ఆడపడుచులు) వరుసగా చనిపోయారు.

వైద్య చికిత్స అందించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ రోషన్ తో పాటు అతని అక్కాచెల్లెలు (sister) మరణించాడు. కుటుంబంలోని మరికొందరు ఇలాంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు, అయితే అదృష్టవశాత్తూ సకాలంలో చికిత్స పొందడంతో మిగిలిన వాళ్లు ప్రాణాలతో బయటపడిపోయారు. ఒకే ఫ్యామిలీలో ఐదు మంది వరుస మరణాలతో ఆ గ్రామంలోని ప్రజలను భయాందోళనలు సృష్టించాయి.ఫుడ్‌పాయిజనింగ్‌గా ఉందని వైద్యులు అనుమానించినప్పటికీ, ప్రాథమిక పరీక్షల్లో, పోస్టుమార్టంలో వాటిని డాక్టర్లు నిర్ధారించలేకపోయారు.

అయితే పోలీసులకు అనుమానం ఎక్కువ కావడంతో అనేక కోణాల్లో విచారణ చేశారు. సంఘమిత్రా కొన్ని సంవత్సరాల క్రితం రోషన్ ను (husband) అతని కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వివాహం (marriage)చేసుకుందని పోలీసుల విచాణలో వెలుగు చూసింది.

Two women of the same family killed five people in the same family by mixing poison in water and food

పెళ్లి అయిన తర్వాత రోషన్, అత్తగారు (daughter in law)విజయా కలిసి సంఘమిత్రాను కొట్టేవారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒకసారి అత్త విజయా కొట్టిన సమయంలో సంఘమిత్రా ఇంటి బయట కూర్చుని ఏడుస్తున్నప్పుడు ఆమె బంధువు రోసా ఆమెను ఓదార్చిందని, తరువాత శంకర్ కుంభరే కుటుంబంపై తనకు కూడా పగ ఉందని చెప్పిందని, తరువాత ఇద్దరూ కలిసి శంకర్ కుటుంబ సభ్యులను హత్య చెయ్యడానిికి ప్లాన్ చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

కుటుంబ సభ్యులను చంపడానికి ఉపయోగించే విషం గురించి సంఘమిత్రా, రోసాలు ఆన్‌లైన్‌లో పరిశోధించారని, ఆర్సెనిక్ అనే పేరు ఉన్న విషంతో ఎవరికీ అనుమానం రాకుండా చంపడానికి అవకాశం ఉందని నిందితులు ఇద్దరూ తెలుసుకున్నారు. సంఘమిత్రాను ఇంట్లోనే వదిలిన రోసా తెలంగాణకు (Telangana) వెళ్లి నీళ్లలో, ఆహారంలో కలిపే విషాన్ని కొనుగోలు చేసి మహారాష్ట్రకు తీసుకు వచ్చిందని పోలీసులు అన్నారు.

తరువాత ఎవరికి అనుమానం రాకుండా నీళ్లలో, ఆహారంలో విషం కలిపిన సంఘమిత్రా, రోసా ఒకే ఫ్యామిలీలోని ఐదు మందిని చంపేశారని (murder) పోలీసులు తెలిపారు. నిందితులు కుటుంబ సభ్యులను చంపడానికి ఉపయోగించిన మిశ్రమాన్ని మూలికా అని నమ్ముతారని, తెలంగాణలో వీళ్లు ఎక్కడ ఆ విషయం కొనుగోలు చేశారు అని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికాులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+