వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. ఇదేమి నోటి దురుసు.. వాళ్లను రేప్ చేయాలన్న బీజేవైఎం మహిళ నేత

|
Google Oneindia TeluguNews

లక్నో : నేతల నోటిదురుసు పీక్ స్టేజీకి చేరింది. ఆయా వర్గాలు, వ్యక్తులను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం ఫ్యాషనైపోయింది. ఎన్నికల సమయంలోనూ కొందరు నేతలు తమ నోటిదురుసును ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా యూపీ బీజేవైఎం నేత సునీతా సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మహిళా మోర్చా అధ్యక్ష పదవీ నుంచి సునీతను తప్పిస్తున్నట్టు స్పష్టంచేసింది.

నోటిదురుసు ..

నోటిదురుసు ..

సునీతా సింగ్ .. యూపీలోని రామ్‌కోల మహిళా మెర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో ఓ కాంట్రవర్సీ కామెంట్ పోస్టు చేశారు. ముస్లిం మహిళలపై హిందువులు సామూహిక లైంగికదాడులు చేయాలని కోరారు. హిందువులు పది మంది గ్రూపుగా ఏర్పడి .. ముస్లి మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలని కోరారు. తల్లులు, చెల్లెళ్లను కూడా వదలకూడదని పిలుపునిచ్చారు. బహిరంగంగా వీధుల్లోకి లక్కొచ్చొ మరీ లైంగిక దాడి చేయాలని .. తర్వాత వారిని ఉరితీయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

లైంగికదాడి చేయాల్సిందే ...

లైంగికదాడి చేయాల్సిందే ...

అంతటితో ఆగలేరు సునీత. దేశాన్ని రక్షించాలంటే హిందువులు మహిళలపై తప్పకుండా లైంగికదాడి చేయాలని స్పష్టంచేశారు. ఈ విషయంలో మరో మాటకు తావులేదన్నారు. అయితే తర్వాత జరిగిన నష్టాన్ని గుర్తించి .. ఫేస్‌బుక్‌లో ఉన్న పోస్టును తొలగించారు సునీత. అయితే అది అప్పటికే ట్విట్టర్‌లో ట్రోలవుతుంది.
సునీతా ఫేస్‌బుక్‌లో రాసిన కామెంట్లను ఓ నెటిజన్ స్కీన్‌షాట్ తీసి ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ప్రపంచానికి తెలిసిపోయింది. దీంతో నెటిజన్లు సునీతా వైఖరిని తప్పుపడుతున్నారు. దీంతో బీజేపీ హైకమాండ్ కూడా స్పందించింది. బీజేవైఎం మహిళా మోర్చా నేత వ్యాఖ్యలను ఉపేక్షించబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆమెను పదవీనుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది.

రెచ్చగొట్టడం సరికాదు ..

రెచ్చగొట్టడం సరికాదు ..

సునీత వ్యాఖ్యలతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళా విభాగం అధిపతిగా ఉంటూ ఓ వర్గాన్ని రెచ్చగొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆమె పదవీ నుంచి తప్పించడం కాదని .. కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సునీత వ్యాఖ్యలను విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇది బీజేపీ వైఖరికి అద్దం పడుతుందని విమర్శించింది. మరోవైపు బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టినా .. ఆ పార్టీకి జరుగాల్సిన నష్టం జరిగిపోయింది.

English summary
Sunita Singh is the President of Ramkola Women Morcha in UP. Recently, however, a Controversy comment was posted on social media Facebook. she urge Hindus .. rape Muslim women. Muslim women were asked to gang-rape. The mothers and sisters were also called upon not to leave. He made serious comments that he should openly take to the streets and then sexually assault them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X